English | Telugu

తెలుగు బుల్లితెర పై కొత్త సీరియల్ తో త్వరలో కనిపించబోతున్న "ఆనందం" హీరో ఆకాష్

"ఆనందం" మూవీ హీరో ఆకాష్ గుర్తున్నాడా..మొదటి సినిమాతోనే బిగ్ హిట్ అందుకుని మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆకాష్ తో మూవీస్ చేయడానికి డైరెక్టర్స్ పోటీ పడ్డారు. కానీ ఆకాష్ మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అలా ఫేడ్ అవుట్ ఐపోయిన ఆకాష్ చాలా ఏళ్ళ తర్వాత బుల్లి తెర మీద కనిపించబోతున్నాడు.

త్వరలో జెమినీ టీవీలో ఒక సీరియల్ ద్వారా అరంగేట్రం చేయబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే అర్ధమవుతుంది. ఈ పిక్స్ లో ఆకాష్ తో పాటు సహనటులు మోనిషా, జబర్దస్త్ ఫేమ్ సన్నీ కూడా ఉన్నారు. ఆకాష్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. "బెంగళూరులో నా కొత్త సీరియల్ షూటింగ్" అంటూ సన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేసాడు. ఐతే సీరియల్ ఏమిటి అందులో ఆకాష్ పాత్ర ఏమిటి అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే ఆకాష్ రెండు తమిళ డైలీ సీరియల్స్ "నీతానే ఎన్ పొన్వసంతం" " తవమై తవమిరుండు" లో నటించాడు. అలాగే ఆయన నటించిన కన్నడ సీరియల్ ‘జోతాయి.. జోతాయల్లీ’ అక్కడి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. 2010 లో "నమో వేంకటేశ" మూవీలో నటించాడు.. ఆ తర్వాత ఎక్కడా కనిపించని ఆకాష్ ఇప్పుడు ఇప్పుడు కొత్త సీరియల్ ద్వారా తెలుగు టీవీ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు. శ్రీలంకలో పుట్టిన ఆకాశ్.. లండన్ లో సెటిల్ అయ్యాడు.

తర్వాత వాళ్ళ ఫామిలీ తమిళనాడుకు వచ్చేసింది. అలా శ్రీలంకన్ తమిళియన్‌గా ఆకాశ్‌కు పేరుంది. ఆనందం తర్వాత తెలుగులో పిలిస్తే పలుకుతా, నీతో చెప్పాలని, వసంతం, ఆనందమానందమాయే, అందాల రాముడు, నవ వసంతం, ఢీ, నమో వెంకటేశ లాంటి చాలా సినిమాలు చేసారు ఆకాష్. ఆయన పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టారు. ఇక ఆకాష్ కు శ్రీలంకలో టీ పౌడర్ బిజినెస్ కూడా ఉంది. ఆకాష్ కె. బాలచందర్ నిర్మించిన "రోజావనం" మూవీలో సెకండ్ లీడ్ రోల్ లో చేసాడు. అప్పటినుంచి అతను తన పేరును జై ఆకాష్ గా పెట్టుకున్నాడు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.