English | Telugu

వర్షం కురిసిన రాత్రి.. ఆ గదిలో ఇద్దరే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -467 లో... కావ్య మొక్కలకి నీళ్లు పోస్తుంటే రాజ్ వచ్చి తనని డిన్నర్ కి ఇన్వైట్ చెయ్యడానికి ట్రై చేస్తాడు. అప్పుడు కూడా మళ్ళీ గొడవపడుతుంటారు. నువ్వు నాతో డిన్నర్ కి రావాలని రాజ్ అనగానే.. ఏంటి ఆర్డర్ వేస్తున్నారా? మీరు అడిగే విధానం నాకు నచ్చడం లేదని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ రిక్వెస్ట్ గా అడుగుతాడు. దాంతో సర్లే మీరు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు కదా వస్తానని కావ్య అంటుంది.

అదంతా విన్న రుద్రాణి రాహుల్ దగ్గరికి వెళ్లి నేనొక పని చెప్తాను చెయ్ అని అంటుంది. నేను బిజీగా ఉన్నా ఆఫీస్ లో మీటింగ్ ఉందని రాహుల్ అంటాడు. కావ్యని తీసుకొని రాజ్ డిన్నర్ కి వెళ్తున్నాడు. అక్కడ తన ప్రేమని కావ్యకి చెప్పాలని అనుకుంటున్నాడు. నువ్వు రాజ్ ని డిన్నర్ కి వెళ్లకుండా ఆపాలని రుద్రాణి అనగానే.. రాహుల్ సరే అంటాడు. మీటింగ్ కి రాజ్ కంపల్సరి ఉండాలని అంటానని రాహుల్ అంటాడు. అదంతా స్వప్న విని మీ సంగతి చెప్తానని కిచెన్ లోకి వెళ్లి జ్యూస్ తీసుకొని.. అందులో మోషన్ టాబ్లెట్ కలుపుతుంది. జ్యూస్ తీసుకొని రాహుల్ దగ్గరికి వెళ్లి ప్రేమగా మాట్లాడి జ్యూస్ ఇస్తుంది. ఆ తర్వాత రాజ్, కావ్య లు డిన్నర్ కి వెళ్తుంటే రాహుల్ ఆపి ఈ రోజు మీటింగ్ ఉంది. నువ్వు కచ్చితంగా రావాలని అంటాడు. నాకు ఎవరు రమ్మని చెప్పలేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్ కి కడుపులో ఏదో తేడా కొడుతుందని పైకి వెళ్తాడు. రాజ్ కావ్య వెళ్లిపోతుంటే రుద్రాణి ఆపుతుంది. మీరు వెళ్ళండి అంటూ స్వప్న వాళ్ళని పంపిస్తుంది. అప్పుడే నీరసంగా రాహుల్ వస్తాడు. ఏం చేసావే నా కొడుకుని అని రుద్రాణి అంటుంది. మీ ప్లాన్ తెలిసి జ్యూస్ లో మోషన్ టాబ్లెట్ కలిపానని స్వప్న అంటుంది.

ఆ తర్వాత కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేస్తాడు. ఇప్పటికి జరిగింది చాలు అని కోపంగా కట్ చేస్తుంది అప్పు. దాంతో కళ్యాణ్ ఎమోషనల్ గా కవితలు రాస్తాడు. మరొకవైపు రాజ్, కావ్య డిన్నర్ స్పాట్ కి వెళ్తారు. రోజు ఇలా తీసుకొని రండి ప్రశాంతంగా ఉందని కావ్య అనగా.. ఇది ఆరంభం మాత్రమే రేపటి నుండి చూడని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య, రాజ్ లు వర్షానికి ఒక దగ్గర ఆగి.. దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్తారు. వర్షం లో తడిసావ్.. అక్కడ చీర ఉంది మార్చుకోమని రాజ్ అనగానే కావ్య మార్చుకుంటుంది. ఎవరో వెళ్లినట్టు అనిపించి కావ్య భయపడి రాజ్ ని హగ్ చేసుకుంటుంది‌. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.