English | Telugu

ఆమెని ఏడ్పించారు.. ఇతను స్టేషన్ కి వెళ్ళాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -461 లో....అపర్ణ, సుభాష్ ల పెళ్లి రోజు సందర్భంగా ఇంట్లో ఫన్నీ గేమ్స్ ఆడుతారు. కేక్ కట్ చెయ్యడానికి ఇద్దరు రెడీగా ఉంటారు. అప్పుడే రుద్రాణి కావాలనే పనిమనిషిని జ్యూస్ తీసుకొని రమ్మని చెప్తుంది. పనిమనిషి అపర్ణ ఇచ్చిన చీర కట్టుకొని వచ్చి అందరికి జ్యూస్ ఇస్తుంటే.. ఆ చీర చూసిన రాజ్, కావ్య, సుభాష్ లు షాక్ అవుతారు.

ఇక కేక్ కట్ చెయ్యండి అని అందరు అంటుంటే సుభాష్ వెళ్లిపోతుంటాడు. సుభాష్ ని రాజ్ ఆపి వద్దని చెప్తాడు. ఇక అపర్ణ అందరి ముందు నవ్వుతూ.. లోపల సుభాష్ పై కోపాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇద్దరు అయిష్టంగా కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత అపర్ణ కేక్ సుభాష్ కి కాకుండా రాజ్ కి తినిపిస్తుంది. దాంతో సుభాష్ డిస్సపాయింట్ అవుతాడు. అందరు బయట ఉంటే అపర్ణ గదిలో ఉంటుంది. సుభాష్ వెళ్లి ఎందుకు నేను ఇచ్చిన చీర పనిమనిషికి ఇచ్చావని అడుగుతాడు. అది నాకు ఇష్టం అన్నట్లుగా అపర్ణ సమాధానం చెప్తుంది. కొద్దీసేపు అపర్ణతో వాదించి సుభాష్ వెళ్ళిపోతాడు. సుభాష్ కి రాజ్ , కావ్యలు ఎదురుపడతారు. సుభాష్ ఏం జరుగనట్టు మాములుగా ఉంటే.. ఇంకా మీరు అన్ని మర్చిపోయి కలిసిపోలేదా అని రాజ్ అంటాడు. ఇక మీరు మమ్మల్ని కలిపే ప్రయత్నం చెయ్యకండి. కొద్దిరోజులు అనామిక, కళ్యాణ్.. కొద్దిరోజులు రాహుల్, స్వప్న‌. కొద్దిరోజులు ఆ మాయ గురించి.. ఇలా మీరు మీ సంతోషం కోల్పోతున్నారని సుభాష్ చివాట్లు పెడతాడు.

ఆ తర్వాత అపర్ణ దగ్గరకి కావ్య వెళ్తుంది. మీ మావయ్య పంపిస్తే వచ్చావా అని అపర్ణ అంటుంది. నాకు ఎవరు చెప్పలేదని కావ్య అంటుంది. మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని కావ్య అనగానే.. నాకే ఎదురు మాట్లాడుతున్నావా అంటూ అపర్ణ కోప్పడుతుంది. మీకు ఎదురుమాట్లాడే దైర్యం నాకు లేదని కావ్య అంటుంది. తరువాయి భాగంలో అప్పుని కొందరు అబ్బాయిలు ఏడిపిస్తే.. అప్పు వాళ్ళని కొడుతుంది. దాంతో అప్పు స్టేషన్ కి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న కళ్యాణ్ అప్పుని ఎవరు ఏడిపించారంటూ అక్కడున్న అబ్బాయిలను కొడతాడు. దాంతో కళ్యాణ్ కూడా అరెస్ట్ అవుతాడు. ఆ విషయం రాజ్ కావ్యలకి స్టేషన్ నుండి పోలీసులు కాల్ చేసి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.