English | Telugu

నటుడు సాయికిరణ్ కి గోల్డెన్ బటన్...

బుల్లితెర మీద హిట్ సీరియల్ గా నిలిచింది గుప్పెడంత మనసు. ఇందులో జగతి, మహేంద్ర, రిషి, వసుధారా, సాక్షి మెయిన్ క్యారెక్టర్స్. నటుడు సాయికిరణ్ ఇందులో మహేంద్రగా ప్రధాన పాత్ర పోషించాడు. ఇక సీరియల్ లో ఆయన క్యారెక్టర్ కి పిచ్చ ఫాన్స్ ఉన్నారు. ఇక సాయి కిరణ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తే. ఎందుకంటే రకరకాల ఇంటరెస్టింగ్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాడు. అందులో చాలా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. దాంతో సాయికిరణ్ వీడియోలు ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి.

కొన్ని భలే ఫన్నీగా కూడా ఉంటాయి. ఈ సీరియల్ లో నటించే ప్రతీ ఒక్కరితో కూడా రీల్స్ చేసి వాటిని షేర్ చేస్తూ ఉంటారాయని. ఆయనకు రిషి అన్నా, వసుధారా అన్నా చాలా అభిమానం. ఆఫ్ లైన్ లో వాళ్ళ అల్లరి గురించి ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు కూడా. అలాంటి సాయి కిరణ్ కి ఇప్పుడు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఐనందుకు యూట్యూబ్ నుంచి గోల్డెన్ బటన్ వచ్చింది. ఇక దాన్ని అందుకున్న ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. "శ్రీరామనవమి శుభాకాంక్షలు. గోల్డెన్ బటన్‌ అందుకున్నా.

నా ప్రియమైన ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ యూట్యూబ్ గోల్డెన్ బటన్ ని నా ప్రియమైన ప్రీతీ శర్మతో , నా పడమటి సంధ్యా రాగం సీరియల్ కుటుంబంతో దీన్ని ఓపెన్ చేయిస్తాను.. ఎలా అంటే సిల్వర్ బటన్ ని నా ప్రియమైన గుప్పెడంత మనసు సీరియల్ నటులు ముఖేష్ - రక్షతో ఎలా ఆవిష్కరించానో అలాగే చేయిస్తాను. ఆ వీడియో త్వరలో మీముందుకు వస్తుంది." అని ట్యాగ్ లైన్ పెట్టారు సాయి కిరణ్. ఇక ఆయన ‘నువ్వే కావాలి’ మూవీ తర్వాత ‘ప్రేమించు’ ‘మనసుంటే చాలు’ ‘ఎంత బావుందో’ వంటి హిట్ మూవీస్ లో హీరోగా నటించాడు. అలాగే సీరియల్ విషయానికి వస్తే ‘కోయిలమ్మ’ ‘పడమటి సంధ్యారాగం’ వంటి సీరియల్స్ లో నటించారు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.