English | Telugu
వాళ్లకు అస్సలు పెళ్లి అవదు.. తేల్చేసిన శీను
Updated : Jul 16, 2022
సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ జోడి స్మాల్ స్క్రీన్ మీద ఆల్ టైం ఫేవరెట్ అని చెప్పొచ్చు. జబర్దస్త్ మొదలైన కొంత కాలం తర్వాత వీళ్లు చేసే స్కిట్స్ ద్వారా వీళ్ళ మధ్యన ఏదో ఉంది అన్న భ్రమను కలిగించారు నిర్వాహకులు. అసలు రష్మీ, సుధీర్ మధ్యన ఏముంది అనేది ఎప్పటికీ అంతుచిక్కని మిస్టరీయే ఆడియన్స్ కి. ఐతే ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద గెటప్ శీను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుధీర్, రష్మీ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ మధ్యన ఏమీ లేదని ఓవైపు చెప్తూ కూడా ఇంకోవైపు ఏదో ఉంది అనుకునేలా క్రియేట్ చేస్తున్నారు.
వీళ్లకు పెళ్ళైనట్లు కూడా చూపించేశారు. ఇక స్క్రీన్ మీద వీళ్ళ కెమిస్ట్రీ చూస్తే మాత్రం నిజమైన లవర్స్ అనే అనుమానం రాకుండా ఉండదు. అందుకే 'ఇద్దరికీ పెళ్లెప్పుడూ?' అంటూ సోషల్ మీడియాలో చాలా మంది పెట్టే కామెంట్స్ చూస్తూనే ఉన్నాం. ఐతే "సుధీర్, రష్మీ ఎప్పటికీ పెళ్లి చేసుకోరు. ఎందుకంటే సుధీర్ కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తి అయ్యాక ఎవరి లోకం వారిది అన్నట్టుగా వెళ్ళిపోతారు. తెరపైన కామెడీని పండించడానికి లవర్స్ ముసుగు తొడుక్కుంటారంతే" అని అన్నాడు శీను.
సుధీర్ తర్వాత శీను కూడా జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేశాడు. ఇక ఇప్పుడు రాంప్రసాద్ మాత్రమే జబర్దస్త్ లో కంటిన్యూ అవుతూ అలరిస్తున్నాడు. అలాగే "జబర్దస్త్ టీం మెంబెర్స్ తమకు వచ్చే రెమ్యూనిరేషన్ నుంచి ఏదో ఒక సేవ కార్యక్రమానికి కొంత డబ్బును ఖర్చు చేస్తాం" అని చెప్పుకొచ్చాడు శీను.