English | Telugu
మ్యాజిక్ చేయబోతున్న ‘అంటే సుధీర్ కి’
Updated : Jul 16, 2022
జబర్దస్త్ వేదిక ద్వారా మస్త్ ఫేమస్ ఐన సుధీర్ ఆ షోని వదిలి వచ్చేసాక వరుసగా షోస్ చేస్తున్నాడు. మరో వైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. జబర్దస్త్ షోలో రష్మీతో కూడా ఆన్ స్క్రీన్ ప్రేమను పండించి మంచి పేరును తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు కూడా. లేడీ ఫాన్స్ కూడా బాగా ఎక్కువయ్యారు సుధీర్ కి . ప్రస్తుతం సూపర్ సింగర్ జూనియర్స్ కి హోస్ట్ గా చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు పార్టీ చేద్దాం పుష్పకి కూడా హోస్ట్ గా చేసాడు సుధీర్.
ఐతే ఇప్పుడు స్టార్ మాలో కొత్త షో ఒకటి మొదలు కాబోతోంది. దాని పేరు "అంటే సుందరానికి" అని పెట్టారు. నాని నటించిన మూవీ పేరునే ఈ షోకి పెట్టారు. ఈ షో స్టార్ మా లో 17 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కాబోతోంది. దీనికి సంబందించిన ప్రోమో ఒకటి ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇందులో సుధీర్ ఎంట్రీ అద్భుతంగా ఉంటుంది. యువరాజు గెటప్ లో అమ్మాయిలతో ఆడిపాడాడు..యువరాణులను తన స్టైల్ తో మెప్పించాడు. ఇందులో ఎక్స్ప్రెస్ హరి, ముక్కు అవినాష్, రోహిణి , అరియనా కూడా కనిపించారు.
ఈ ప్రోమోలో అమ్మాయిలతో కలిసి ఉట్టి కొడతాడు సుధీర్. యువరాణులకు బాణాలు ఎక్కుపెట్టి విలు విద్య కూడా నేర్పిస్తున్నట్టు కనిపిస్తాడు. ఇప్పుడు ఈ షోతో మరొకసారి మ్యాజిక్ చేయబోతున్నాడు సుడిగాలి. ఇక ఇప్పుడు మూవీస్ పరంగా వాంటెడ్ పండుగాడ్, పట్టుకుంటే కోటి వంటి మూవీస్ తో అలరించబోతున్నాడు. అలాగే గాలోడు సినిమా కూడా చేసాడు సుధీర్.