English | Telugu

జెమినీ టీవీలో త్వరలో 'గీతాంజలి' కొత్త సీరియల్ ప్రారంభం!

ఫేమస్ టీవీ యాక్టర్, వదినమ్మ సీరియల్ ఫేమ్ సుజిత ధనుష్ సరికొత్త సీరియల్ తో త్వరలో బుల్లితెర మీద కనిపించబోతోంది. 'గీతాంజలి' అనే టైటిల్‌తో రూపొందిన ఈ కొత్త సీరియల్ లో రవికిరణ్, నరసింహరాజు, లహరి తదితరుల తారాగణం ఇందులో కనిపించింది. త్వరలో ప్రసారం కాబోతున్న ఈ డైలీ సీరియల్ లో సుజిత ధనుష్ , రవికిరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా లహరి మరికొంత మంది సపోర్టింగ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ ఐన ఈ టీజర్ లో గీతాంజలి కుటుంబం, వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు ఏమిటి అనేది అర్ధమవుతుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వారి వారి సొంత ఆశలు ఉన్నాయి ఐతే గీతాంజలి చురుకైన భార్య కాబట్టి తన భర్త కోరిక నెరవేరాలని కోరుకుంటుంది. ఇక గీతాంజలి భర్త కూడా భార్య ఆశే తన ఆశ అని చెప్తాడు.

తమిళంలో మంచి రేటింగ్ సంపాదించుకున్న "సెవ్వంతి"కి తెలుగు రీమేక్ ఈ సీరియల్. సుజిత సీరియల్స్ లోనే కాదు సిల్వర్ స్క్రీన్ మీద తెలుగు, తమిళ్, మలయాళం మూవీస్ లో నటించింది. ఈమె డైరెక్టర్ సూర్యకిరణ్ సిస్టర్. సుజిత చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు వారికి సుపరిచితమే. చిరంజీవి సినిమా పసివాడి ప్రాణంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. తరువాత జై చిరంజీవి మూవీలో చిరంజీవి చెల్లిగానూ నటించింది. అలా వెండితెరపై సుజిత సందడి చేసింది. సుజిత సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది. బుల్లితెర మీద ఎక్కువగా చీరకట్టులో కనిపించే సుజిత.. అప్పుడప్పుడు మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తూ సోషల్ మీడియాలో అదరగొడుతూ ఉంటుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.