English | Telugu

నేను ఇల్లు ఎలా కొన్నానంటే...ఇదిగో ఇలా

దీప్తి సునైనా..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె గురించి తెలియని వారు లేరు. సోషల్ మీడియా స్టార్ గా ఈమెకు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంది. దీప్తీ యూట్యూబ్ లో వెబ్ సీరీస్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా చేసి హీరో తనిష్ తో కొన్ని రోజులు స్క్రీన్ లవ్ ట్రాక్ ని నడిపింది. అప్పట్లో ఈ అమ్మడిపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ కూడా వచ్చాయి. దీప్తి సోషల్ మీడియాలో ఫాన్స్ అడిగే ప్రశ్నలకు కొన్ని సార్లు ఘాటైన సమాధానాలే చెప్తుంది. లేటెస్ట్ గా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం చెప్పింది.

" ఇల్లు ఎలా కొన్నావ్" అని అడిగేసరికి "నాకు వచ్చే ఆదాయంలో 30 శాతం ఖర్చు పెట్టి 70 శాతం సేవ్ చేసి ఇల్లు కొన్నా" అని ఆన్సర్ ఇచ్చింది. ఇక మరో నెటిజన్ " మీరు చెన్నైకి ఎప్పుడొస్తున్నారు అని అడగడంతో.. త్వరలో వస్తాను అని రిప్లై ఇచ్చింది. దీప్తికి షన్నుకి మధ్య బ్రేకప్ ఐన దగ్గర నుంచి ఎవరి లైఫ్ లో వాళ్ళు చాలా బిజీ ఇపోయారు. దీప్తి ఫోటో షూట్స్, కవర్ సాంగ్స్ చేస్తూ ఉంటే షన్ను వెబ్ సిరీస్, జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ రకరకాల ప్రోగ్రామ్స్ లో ఎంగేజ్ అవుతూ కనిపిస్తున్నారు.

ఇక ఇన్స్టాగ్రామ్ లో ఆడియన్స్ తో చిట్ చాట్ చేయడం వాళ్లకు సరైన సమాధానం ఇవ్వడం వంటివి చేస్తున్నారు ఈ ఇద్దరూ. ఐతే చాలా మంది వీళ్ళు మళ్ళీ కలిస్తే బాగుండు అనుకుంటున్నారు కానీ వీళ్ళు మాత్రం కలిసేటట్టే లేరు. ఎవరికి వాళ్ళు సొంత కార్లు, ఇల్లు కొనుక్కుని హ్యాపీగా ఉంటున్నారు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.