English | Telugu

బిగ్ బాస్ సీజన్ 4 - సీజన్ 5కి మధ్య రసవత్తరమైన పోటీ!

'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక ఈ వారం బిగ్ బాస్ సీజన్ 4 - సీజన్ 5కి మధ్య పోటీ మంచి రసవత్తరంగా ఉండబోతోంది. సీజన్ 4 నుంచి సోహైల్, నోయెల్, అరియానా గ్లోరి, దివి,, అమ్మ రాజశేఖర్ వచ్చారు. సీజన్ 5 నుంచి టైటిల్ విన్నర్ వీజే సన్నీ, ఆర్జే కాజల్, మానస్, సిరి హనుమంత్, హమిదా హాజరయ్యారు. ఖైదీ మూవీలో కార్తీ గెటప్ లో బిర్యానీ తింటూ సోహేల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతలో " సిరి.. హౌజ్ లో ఉన్న మీ హార్ట్ శ్రీహాన్ కు ఏం చెప్పాలనుకుంటున్నారు" అని బిగ్ బాస్ సడెన్ గా అడిగేసరికి సిరి కన్నీళ్లు పెట్టుకుంది.

తర్వాత " సోహేల్ మీ కథ ఎలా ఉంది" అని అడిగేసరికి .. "బిగ్ బాస్ వల్ల ఇప్పుడు నేను ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తున్నాను. కానీ ఏదో భయం" అంటూ చెబుతుండగా వీజే సన్నీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక నోయెల్ వచ్చి ఒక అద్భుతమైన రాప్ పాడి అందరిలో ఒక కసిని, జోష్ ని నింపాడు.

ఇక మాజీ కంటెస్టెంట్స్ అంతా ఏం మాట్లాడారు, వాళ్ళ జర్నీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.