English | Telugu
బంఢారం బయటపెట్టేసిన రామలక్ష్మి... సందీప్ కి వార్నింగ్ ఇచ్చిన సీతాకాంత్!
Updated : Jul 27, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -159 లో.. మీరు ఇన్ని రోజులు సీతా సర్ కి పెళ్లి ఎందుకు చేయలేదని శ్రీలతని అడుగుతుంది రామలక్ష్మి. నేను ఎప్పుడు వాడికి పెళ్లి చేస్తాను అన్నాను.. నిన్ను కూడా వారసుడిని ఇప్పుడిస్తావని అడిగాను.. నువ్వు సమాధానం చెప్పలేదు. ఇప్పుడూ చెప్పు వారసుడిని ఎప్పుడు ఇస్తావని శ్రీలత అడుగుతుంది. మాకు ఈ మధ్య పెళ్లి అయింది.. ఎప్పుడో పెళ్లి అయిన శ్రీవల్లి, సందీప్ లని వదిలేసి మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని రామలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత అసలు పెళ్లి చేసుకోకపోవడం అనేది పూర్తిగా అది నా నిర్ణయం.. నువ్వు ఆలా అమ్మని అడిగి బాధపెట్టకని సీతాకాంత్ కోపంగా భోజనం చేయకుండా వెళ్లిపోతాడు. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి సందీప్ వచ్చి.. చూసావా మమ్మీ ఆ రామలక్ష్మి అన్నయ్య ముందే ఎన్ని మాటలు అంటుందోనని సందీప్ అంటాడు.అది వదిలేయ్ గాని పని ఎంత వరకు వచ్చింది. ఒకే మమ్మీ ఏ డౌట్ లేకుండా పని పూర్తి అవుతుందని సందీప్ అంటాడు. దాని వాళ్ళ నష్టం జరిగితే అది సీతాకాంత్ వళ్లే జరిగిందని చెప్పి చైర్మన్ పదవి నుండి తొలగించవచ్చు. ఆ తర్వాత ఆ సామ్రాజ్యానికి నువ్వే రాజ్ వి అని శ్రీలత అంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. వాళ్ళ మాటలు సీతాకాంత్ విన్నాడేమో అని భయపడతారు కానీ సీతాకాంత్ వచ్చి రామలక్ష్మి మాటలు పట్టించుకోకూ అమ్మ అని చెప్తాడు.ఆ తర్వాత మాణిక్యం సందీప్ ని కలిసి పెద్దాయన దగ్గరికి వస్తాడు. నేను సిరి గ్రూప్ ఇండస్ట్రీస్ నుండి వచ్చాను. అసలేం జరిగింది ఏం భయపడకని అడుగుతాడు. దాంతో పెద్దాయన జరిగింది చెప్తాడు. ఆ విషయం మాణిక్యం రామలక్ష్మికి ఫోన్ చేసి చెప్తాడు. రామలక్ష్మి పెద్దాయనతో ఫోన్ లో మాట్లాడుతుంది. వచ్చి నిజం చెప్పమంటుంది.
ఆ తర్వాత మరుసటి రోజు రామలక్ష్మి పెద్దాయన కోసం ఎదరుచూస్తుంది. అప్పుడే పెద్దాయన వచ్చి మీరు కొన్న ల్యాండ్ ఇండస్ట్రీకి పనికి రాదు ఇల్లు కట్టుకొవడానికి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఆ విషయం చెప్పాడానికి వస్తే ప్రొద్దున పట్టించుకోలేదని పెద్దాయన చెప్పగానే సందీప్ టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత సందీప్ పైన కోప్పడతాడు సీతాకాంత్. సందీప్ కవర్ చేయాలనీ ట్రై చేస్తాడు కానీ.. పెద్దాయన మీతో చెప్పానని అనగానే సీతాకాంత్ కి కోపం వస్తుంది. థాంక్స్ మంచి పని చేశారని సీతాకాంత్ పెద్దాయనని పంపిస్తాడు. ఆ తర్వాత అమ్మ మొహం చూసి వదిలిపెడుతున్నా ఇంకొకసారి ఇలా చేసావో.. ఏం చేస్తానో తెలియదంటూ సీతాకాంత్ సందీప్ కి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఎలా ఉందని రామలక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్లి కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.