English | Telugu

Guppedantha Manasu : వసుధారకి గిఫ్ట్ ఇచ్చిన రిషి..

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1137 లో.... రంగాకి రిషి ఫోటోని చూపించి, ఇతను నా తమ్ముడు సేమ్ నీలాగా ఉన్నాడు ముందు నేను నమ్మలేదు కానీ నువ్వు వేరు వాడు వేరని ఆ తర్వాత క్లారిటీ వచ్చిందని శైలేంద్ర అంటాడు. అతను ఒక కాలేజీ ఎండీ మంచి మనిషి అలాంటివాడు ఇప్పుడు మా మధ్య లేడు. అందుకే నీతో అవసరం వచ్చిందని శైలేంద్ర అంటాడు. దాంతో అయితే నాతో ఏం అవసరమని రంగా అడుగుతాడు.

నువ్వు నాతో రిషిలా మా కాలేజీ కకి రావాలి ఎండీగా ఉండాలని శైలేంద్ర అనగానే.. నా వల్ల కాదు.. నేను పెద్దగా చదువుకోలేదు సర్ అని రంగా అంటాడు. అది నిజమే కానీ నువ్వు వచ్చి నన్ను ఎండీని చెయ్యండి అని చెప్పు చాలు.. ఇప్పుడు ఇలా చెయ్యకపోతే కాలేజీ నాశనం అవుతుంది. స్టూడెంట్ భవిష్యత్తు పాడవుతుంది. నువ్వు ఇది చేస్తే కాలేజీని స్టూడెంట్స్ ని మా బాబాయ్ ని కాపాడిన వాడివి అవుతావు. నువ్వు ఊరికే ఏం చేయకు, నీకు కోటి రూపాయలు ఇస్తాను. అప్పులన్నీ తీరీపోతాయని రంగాని రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర. నేను ఒప్పుకోనని రంగా అనగానే.. నువ్వు అలోచించి నిర్ణయం చెప్పమని శైలేంద్ర అంటాడు.ఆ తర్వాత ఇలా వాడికి డబ్బులు ఆఫర్ చేశాను కానీ వాడు సైలెంట్ గా వెళ్లి పోయాడని దేవయానికి శైలేంద్ర వచ్చి చెప్తాడు. అలా డబ్బులు తీసుకోలేదంటే వాడు రిషి కావచ్చని దేవయాని అంటుంది. వాడు రిషి కాదు రంగా అని శైలేంద్ర అంటాడు. వాడే ఫోన్ చేస్తాడు ఒప్పుకుంటాడని శైలేంద్ర అనగానే.. అపుడే ధరణి చాటుగా ఆ మాటలు వింటుంది‌. వీల్లెదో ప్లాన్ చేస్తున్నారులని ధరణి అనుకుంటుంది.

ఆ తర్వాత మీరు కాలేజీ గురించి ఆలోచించకుండా.. నన్ను ఎలా రంగా కాదు రిషి అని ప్రూవ్ చెయ్యాలని స్వార్థంగా ఆలోచిస్తున్నారని వసుధార పైన రంగా కోప్పడతాడు. మీరు రండీ ఇద్దరం వెళదామని వసుధార అంటుంది. నేను రానని కోపంగా రంగా వెళ్తాడు. ఆ తర్వాత వసుధార మొహం కడుక్కొని అద్దం దగ్గరికి వెళ్లి చేసుకుంటుంది. తన చేతికి ఉన్న రింగ్ కనిపించదు. దాంతో అంతా వెతుకుతుంది. వెళ్లి రాధమ్మకి చెప్తుంది. దొరుకుతుందని రాధమ్మ అంటుంది. రిషి సర్ ఎక్కడా అని వసుధార అడగ్గానే.. బుజ్జిని తీసుకొని ఎక్కడికో వెళ్ళాడు. నీకు ఇది ఇవ్వమన్నాడని ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడని, దానిని వసుధారకి ఇస్తుంది రాధమ్మ. మరొకవైపు శైలేంద్రని రంగా కలుస్తాడు. శైలేంద్ర చెప్పిన దానికి రంగా సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.