English | Telugu

ములక్కాడ తిను నీ కళ్ళు బయటికొస్తాయి..

స్టార్ మాలో రీసెంట్ గా "కూకు విత్ జాతిరత్నాలు" పేరుతో ఒక కుకింగ్ షో స్టార్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రతీ శని, ఆదివారాల్లో ఈ షో ప్రసారమవుతుంది. లేటెస్ట్ ప్రోమోలో దీక్ష పంత్ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. "మీకు అసలు సిసలైన ఫుల్ మీల్స్ ని రెడీ చేసాం" అన్నాడు ప్రదీప్. రాగానే జడ్జ్ ఆశిష్ విద్యార్థి రాధా మీద మంచి కామెంట్ చేసాడు. "ప్రదీప్ వండర్స్ ఎన్ని" అనేసరికి సెవెన్ అన్నాడు కాదు ఎయిట్ అది రాధమ్మ స్మైల్ ప్రదీప్ అనేసరికి రాధ పగలబడి నవ్వేసింది. ఇక కిచెన్ రూకీస్ పేరుతో అవినాష్, దీక్ష పంత్, విష్ణు ప్రియా, బిత్తిరి సత్తి, ఆర్జే హేమంత్ వచ్చారు. "జడ్జెస్ మీరు దీక్ష గారు గుర్తు ఉన్నారు కదా షో లాంచ్ లో మంచి టిప్స్ ఇచ్చారు" అన్నాడు. "గోంగూర తింటే గోల్స్ రీచ్ అవుతారు" అని చెప్పింది దీక్ష. "ఈవిడ ఆ టిప్ చెప్పాక గోంగూరకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది సర్" అన్నాడు ప్రదీప్. "నాకు తెలుసు ప్రదీప్" అంది.

"నేనే జోక్ వేసాను దానికి ఎక్స్టెన్షన్ జోక్ వేసింది" అంటూ దీక్ష మీద కామెడీ కౌంటర్ వేసాడు ప్రదీప్. "అవును ప్రదీప్ ఏంటి మీ కళ్ళు కొంచెం లోపలి వెళ్లాయి" అంది దీక్ష. "ఏమన్నా టిప్స్ ఉన్నాయా" అని అడిగాడు. "ములక్కాడ తిను కళ్ళు బయటకు వస్తాయి" అని చెప్పింది. తర్వాత కుకింగ్ లెజెండ్స్ పేరుతో ప్రియా, విజె సన్నీ, యష్మి, ప్రభాకర్ వచ్చారు. "మీరు వంటల్లో అదుర్స్, మా జాతిరత్నాలు వంటల్లో బెదుర్స్" అని జడ్జ్ సంజయ్ తుమ్మ చెప్పేసరికి "సర్ మేము వంటల్లో ముదుర్స్" అంటూ ప్రియా రివర్స్ డైలాగ్ వేసింది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..