English | Telugu

టీఆర్పీ చార్ట్ లో టాప్ లో దూసుకుపోతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'

"కార్తీకదీపం" సీరియల్ ఉన్నన్ని రోజులు కూడా టీఆర్పీ రేటింగ్స్ లో అదే ముందు వరసలో నిలబడేది. కానీ ఇప్పుడు ఆ సీరియల్ కి శుభం కార్డు పడిపోయాక దాని ప్లేస్ లో "గుప్పెడంత మనసు" సీరియల్ మొదటి స్థానంలో నిలబడింది. లేటెస్ట్ టీఆర్పీ రిపోర్ట్స్ ప్రకారం ఫామిలీ అండ్ లవ్ డ్రామాతో నడుస్తున్న ఈ సీరియల్ లో ముఖేష్, రక్షాగౌడ, సాయి కిరణ్ రామ్, జ్యోతి రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, మానస్, దీపికా రంగరాజు, హమీదా ఖాతూన్ తదితరులు నటించిన "బ్రహ్మముడి" సీరియల్ మాత్రం సెకండ్ ప్లేస్ లో నిలబడింది.

ఇక కస్తూరి శంకర్, హరికృష్ణ, ప్రశాంతి తదితరులు నటించిన "ఇంటింటి గృహలక్ష్మి" మూడవ స్థానంలో నిలబడింది. దీంతో పాటు "కృష్ణ ముకుంద మురారి" కూడా థర్డ్ ప్లేస్ కి వచ్చేసింది. ఆషికా పదుకొణె, చందూ గౌడ నటించిన "త్రినయని" టాప్ 5 లో ఎంటరయ్యింది. అలాగే కామెడీ షోస్ లో జబర్దస్త్ ముందు వరసలో ఉండగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ కి రేటింగ్ లో కొంచెం వెనకబడింది. "సుమ అడ్డా" షోకి పూర్తిగా టీఆర్పీ పడిపోయింది. మరోవైపు శ్రీముఖి హోస్ట్ చేస్తోన్న 'BB జోడి' రేటింగ్ కాస్త పెరిగింది. కన్నడ సినిమా 'కాంతారా' మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంది.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.