English | Telugu
90 స్ కిడ్స్ సూపర్ అనేది ఇందుకే...
Updated : Jul 29, 2024
సమీరా భరద్వాజ్ అంటే చాలు పక్కా ర్యాగింగ్ క్యారెక్టర్. సింగర్ ల స్మూత్ గా పాడి మెస్మోరైజ్ చేస్తుంది. టు వెర్షన్స్ లో కామెడీ రీల్స్ చేస్తుంది. గట్టిగా అరుస్తూ తిడుతుంది. అబ్బో ఆవిడ యమా యాక్టివ్. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోకి లేడీస్ అందరూ తెగ కనెక్ట్ ఐపోతున్నారు. మీరు 90 స్ కిడ్స్ ఐతే కచ్చితంగా కనెక్ట్ ఐపోతారు. ఎందుకంటే అప్పట్లో సీరియల్స్ దే హవా. ఆ సీరియల్స్ కూడా మంచి కంటెంట్ మంచి టైటిల్ సాంగ్స్ తో ప్రతీ ఒక్కరూ పాడేసేలా ఉండేవి. ఒకటికి మించి మరొకటి అన్నట్టుగా ఉండేవి.
ఇంట్లో అమ్మలతో పాటు పిల్లలు కూడా పాడేసేవాళ్ళు, సీరియల్స్ ని బోర్ లేకుండా చూసేసేవాళ్ళు. ఇప్పుడు దాని మీదే సమీరా ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. " 90 స్ హౌస్ లో ఒక మాములు రోజు" ఎలా ఉంటుంది అన్నదే ఆ రీల్ లోని టాపిక్. ఇక ఆ సీరియల్స్ సాంగ్స్ పాడి వినిపించింది. స్నేహ, అంతరంగాలు, విధి, అందం, ఎండమావులు, లేడీ డిటెక్టీవ్, నాగమ్మ, చక్రవాకం, మొగలి రేకులు, శ్రీ భాగవతం, పిన్ని, నమ్మకం, మెట్టెల సవ్వడి, అమ్మ ఈ సీరియల్స్ టైటిల్ సాంగ్స్ పాడి వినిపించేసింది. ఎంతమంది 90 స్ కిడ్స్ ఈ సీరియల్స్ చూస్తూ పెరిగారు అంటూ కూడా అడిగింది. ఇక నెటిజన్స్ కామెంట్స్ కుప్పలుగా వచ్చాయి. సమీరా మర్చిపోయిన కొన్ని సీరియల్స్ ని గుర్తు చేశారు. అన్వేషిత, రహస్యం, మర్మదేశం, పంచతంత్రం, ఋతురాగాలు, నాగాస్త్రం మర్చిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అప్పటి ప్రతీ సీరియల్ రేటింగ్ బీభత్సంగా ఉండేది...రాడాన్, ఏవిఎం ప్రొడక్షన్స్ వచ్చిన చాలా సీరియల్స్ కూడా ఇప్పటికీ 90 స్ కిడ్స్ హమ్ చేస్తూనే ఉంటారు. అందులో మరి మీరు ఉన్నారా ?