English | Telugu
కార్తీకదీపం సీరియల్ నుంచి మోనిత అవుట్...చారుశీల ఇన్!
Updated : Dec 22, 2022
కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న సీరియల్. ఇందులోని క్యారెక్టర్లను ఇంట్లో వాళ్ళల్లా ఫీలవుతూ ఉంటారు తెలుగు ఆడియన్స్. ఇక ఈ సీరియల్ లో లేడీ విలన్ గా చేసిన మోనితను బాగా తిట్టుకుంటూ ఉంటారు. అలాంటి మోనిత క్యారెక్టర్ ఇప్పుడు సీరియల్ లో కనిపించకుండాపోయింది. మోనితగా శోభాశెట్టి కెరియర్‌ని టర్న్ చేసిన సీరియల్ ఈ కార్తీక దీపం.
ఐతే ఈ సీరియల్ లో తన రోల్ ఐపోయేసరికి మోనిత బాధపడుతోంది. తన లైఫ్‌లో ఎన్నో సీరియల్స్ చేసింది. కానీ ఇంతలా ఎప్పుడూ బాధపడలేదంటూ చెప్పింది మోనిత. రీ ఎంట్రీ తరువాత ఐదు నెలలు మాత్రమే వర్క్ చేసినట్లు చెప్పింది. "కార్తీకదీపం నెక్స్ట్ షెడ్యూల్ కోసం అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నా. జైలుకు వెళ్లొచ్చాక నా రీఎంట్రీ మళ్ళీ ఉంటుందని ఎదురుచూస్తున్నా..కానీ సీరియల్ నుంచి తీసేశామని చెప్పారు..ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదు" అని బాధపడింది శోభా శెట్టి. కానీ అంతలోనే "తనను కావాలని తీసేయలేదని..కథ అలా మలుపు తిరిగిందని చెప్పుకొచ్చింది" మోనిత. కథ ఇంకా ఆసక్తికరంగా ఉండాలి అంటే తనను తీసేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు అంది.
కథ ప్రకారం చూసుకుంటే మోనిత క్యారెక్టర్ గురించి కార్తీక్ కి అన్ని విషయాలు తెలిసిపోయాయి కాబట్టి అతను నమ్మే పరిస్థితి ఉండదు..అంతా తెలిసిపోయింది కాబట్టి కథలో కొత్తదనం కూడా ఉండదు చూసేవాళ్లకు కూడా చాలా బోర్ కొట్టేస్తుంది కాబట్టే తీసేశారని చెప్పుకొచ్చింది మోనిత. ఐతే తన ప్లేస్ లో చారుశీల అనే కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె కథను నడిపిస్తోంది. తన జర్నీ ఇక్కడితో అయిపోలేదని ఇకముందు మంచి ప్రాజెక్ట్స్ లో చేసి ఆడియన్స్ కి మరింత దగ్గరవుతానని చెప్పింది.