English | Telugu

కళ్ళకు గంతలు కట్టుకుని కూతురిని చేతుల్లోకి తీసుకున్న రేవంత్!

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారి ఎంట్రీ ఇచ్చారంటే ఫామిలీ మెంబర్స్ అందరినీ మిస్ అవక తప్పదు. ఇందులో ఉన్నన్ని రోజులు బయటి ప్రపంచంతో అసలు సంబంధమే ఉండదు. అలా ఉంటుంది. అలాంటి టైంలో రీసెంట్ గా సీజన్ - 6 కంటెస్టెంట్ టైటిల్ విన్నర్ సింగర్ రేవంత్ కూడా తన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యాడు. తన వైఫ్ ప్రెగ్నెంట్ కావడంతో హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమెను కలవలేకపోయాడు.

కానీ.. ఫైనల్లీ ఇటీవల రేవంత్ భార్య అన్విత.. పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే.. హౌస్ లో ఉండి.. కేవలం వీడియో కాల్స్ కే పరిమితమైన రేవంత్.. విన్నర్ గా ఇంటికెళ్ళాక .. మొదటిసారి తన కూతురుని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. మొదటిసారి చూస్తున్నాడు కాబట్టి పాప దగ్గరికి కళ్ళకు గంతలు కట్టుకుని కూతురిని చేతుల్లోకి తీసుకుని చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇకపోతే తాను గెలిచిన బిగ్ బాస్ 6 ట్రోఫీ కూడా కూతురికి అంకితం ఇచ్చేస్తున్నట్లు స్టేజి మీద చెప్పాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.