English | Telugu
Brahmamudi : తప్పు తెలుసుకొని స్వప్నని రిక్వెస్ట్ చేసిన రాహుల్.. క్షమించేసిందిగా!
Updated : Nov 7, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -872 లో..... రాజ్, కావ్య కలిసి కోయిలి నిజస్వరూపం బయటపెడుతారు. ఒరేయ్ రాహుల్ ఇప్పటికైనా స్వప్న గొప్పతనం అర్థం చేసుకొని దీన్ని వదిలేసెయ్ రా అని రాహుల్ కి రాజ్, కావ్య చెప్పి బయటకు వెళ్తారు. బయటకు వచ్చి రాజ్, కావ్య, గోల్డ్ బాబూ ముగ్గురు కలిసి ప్లాన్ సక్సెస్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా రంజిత్ విని ఇదంతా రాహుల్ ని తీసుకొని వెళ్ళడానికి చేసిన ప్లానా అని రంజిత్ అనుకుంటాడు.
మరొకవైపు కోయిలిని రాహుల్ తిడుతాడు. నీ కోసం నా పెళ్ళాన్ని కూడా వదిలెయ్యాలనుకున్నాను. కానీ నన్ను వదిలేసి డబ్బు ఉన్నవాడు రాగానే వాడితో పోయావని రాహుల్ అంటాడు. అవును రా నిన్ను ట్రాప్ చెయ్యాలనుకున్నా.. మరి నువ్వు ఏమైనా తక్కువా.. భార్యా బిడ్డ ఉన్నా కూడా నా కోసం వచ్చావని కోయిలి అంటుంది. కొట్టినా, తిట్టినా నా భార్య గొప్పది అని రాహుల్ అంటాడు. కోయిలి స్వప్న గురించి తప్పుగా మాట్లాడుతుంటే కోయిలి చెంప చెల్లుమనిపిస్తాడు రాహుల్. అదంతా రంజిత్ వీడియో తీస్తాడు.
మరొక వైపు రాజ్, కావ్య ఇంటికి వచ్చి జరిగింది చెప్తూ నవ్వుకుంటారు. అప్పుడే రాహుల్ ఎంట్రీ ఇస్తాడు. నన్ను క్షమించమని స్వప్నతో అంటాడు. ఎన్నిసార్లు ఇలా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటావని స్వప్న కోప్పడుతుంది. ఈ ఒక్కసారికి క్షమించమని రాజ్, కావ్య ఇద్దరు స్వప్నకి సర్ది చెప్తారు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని స్వప్నతో రాహుల్ చెప్పాడు. దాంతో స్వప్న క్షమిస్తుంది. ఆ తర్వాత ఎందుకురా ఇలాంటివి చేసి వాళ్ళ ముందు తల దించుతావ్. ఇక మీదట నేను చెప్పినట్టు చెయ్ నన్ను ఫాలో అవ్వమని రుద్రాణి చెప్పగానే రాహుల్ సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.