English | Telugu

Karthika Deepam 2: దీప ఎప్పటికీ రాదు.. ఏడ్చేసిన శౌర్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -342 లో.. పూజ కోసం కాంచన ఏర్పాట్లు చేస్తుంటే.. కార్తీక్ వస్తాడు. కార్తీక్ షర్ట్ పై బ్లడ్ చూసి ఏంటి నాన్న అది అని శౌర్య అడుగుతుంది. దారిలో చిన్న ఆక్సిడెంట్ అని కార్తీక్ చెప్తాడు. మరి ఆ బ్యాండేజ్ ఏంటని శౌర్య అడుగుతుంది. బ్లడ్ ఇచ్చానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ ఫ్రెషప్ అయి వచ్చాక దీప జైల్లో నుండి బయటకు రావాలని అందరు నేలపైన భోజనం చేస్తారు.

మరొకపక్క దీపకి కానిస్టేబుల్ భోజనం తీసుకొని వస్తుంది. దీప భోజనం చేస్తూ తన కూతురితో గడిపిన క్షణాన్ని గుర్తు చేసుకొని బాధపడుతుంది. ఆ తర్వాత శ్రీధర్ ఎప్పటిలాగే కావేరితో గొడవ పడుతుంటాడు. కార్తీక్, కాంచన మాట్లాడుకుంటారు. లాయర్ తో మాట్లాడు మన దగ్గరున్న సాక్ష్యాలు దీపని బయటకు తీసుకొని రాలేవని కార్తీక్ తో కాంచన అంటుంది. నిజం చెప్పావ్ అత్త అని జ్యోత్స్న వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావని జ్యోత్స్నని కార్తీక్ కోప్పడతాడు. మా డాడ్ బాగయి ఇంటికి వచ్చాడు. కానీ నీ కోడలు ఇంటికి రాదని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావ్ శౌర్య వింటుందని జ్యోత్స్నని బయటకు తీసుకొని వెళ్లి మాట్లాడతాడు కార్తీక్.

దీప ఎప్పటికి బయటకు రాదని మళ్ళీ జ్యోత్స్న అంటుంది. ఆ మాట బయట ఆడుకుంటున్న శౌర్య వింటుంది. కార్తీక్ లోపలికి వెళ్ళాక జ్యోత్స్న వెళ్తుంటే.. శౌర్య వచ్చి మా అమ్మ ఎక్కడుంది ఎందుకు రాదని అంటున్నావని అడుగుతుంది. మీ అమ్మ ఎప్పటికి రాదు అంటూ జ్యోత్స్న అంటుంటే శౌర్య ఏడుస్తుంది. కాసేపటికి జ్యోత్స్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.