English | Telugu

Brahmamudi: రాజ్ ని చూసి షాకైన కావ్య.. దుగ్గిరాల కుటుంబానికి గుడ్ న్యూస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-670లో... రాజ్ లేడని దుగ్గిరాల కుటుంబం అంతా తీవ్రంగా బాధపడుతుంటారు. ఇక స్వప్న పాలు తీసుకొని కావ్య దగ్గరికి వస్తుంది. నిన్నటి నుండి ఏం తినలేదు కనీసం పాలు అయిన తాగమని కావ్యకి స్వప్న ఇస్తే వద్దని అంటుంది. ఇంటికి పెద్ద అనుకున్న కొడుకే లేనప్పుడు తిండి ఎందుకని అపర్ణ అంటుంది. అప్పుడే ఫోరెన్సిక్ రిపోర్టు తీసుకొని కానిస్టేబుల్ వచ్చి అప్పుకి ఇస్తాడు. రాజ్ షర్ట్ మీద బ్లడ్ సాంపుల్ ని టెస్ట్ కి పంపించానని అది రాజ్ బావదేనని రిపోర్ట్ వచ్చిందని అప్పు చెప్తుంది‌‌. దాంతో దుగ్గిరాల కుటుంబమంతా ఎమోషనల్ అవుతారు. ఇక కావ్య ఆ రిపోర్ట్ పేపర్స్ తీసుకొని చింపేస్తుంది. నా రాజ్ బ్రతికే ఉన్నాడంటూ చెప్తుంది. రాజ్ ఎక్కడున్నా నేను తీసుకొస్తానంటూ కావ్య బయటకు వెళ్లిపోతుంది.

మరోవైపు యామిని ఫోన్ లో తన ఫ్రెండ్ తో మాట్లాడతుంది. ఎంగేజ్ మెంట్ అయినట్టు భళే ఎడిట్ చేశావ్ రా అంటు మాట్లాడుతుంటే అప్పుడే రాజ్ వస్తాడు. ఇక టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతుంది యామిని. తన గతంలో యామిని లేదని, సాక్ష్యాలు మాత్రమే ఉన్నాయంటూ రాజ్ డౌట్ గా అనడంతో మన ప్రేమ పెళ్ళిదాకా వచ్చిందంటూ యామిని చెప్తుంది. తనకు కాస్త ఫ్రీడమ్ కావాలని, గడువు కావాలని రాజ్ అనగా యామిని సరేనంటుంది. ఇక యామిని, రాజ్ కలిసి కార్ లో సిటీ అంతా తిరుగుతుంటే అప్పుడే కావ్య కారులో వెళ్తుంటుంది. ఇక రాజ్ ని కారులో వెళ్తుండగా చూస్తుంది‌. వెంటనే కారు దిగి పరుగెడుతుంది.

మరోవైపు దుగ్గిరాల కుటుంబమంతా రాజ్ లేడనే బాధలో ఉండగా.. రాహుల్ కంపెనీకి వెళ్తానని రెడీ అయి వస్తాడు. ఇక రుద్రాణి తన స్టైల్ లో మాయమాటలు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అందరు ఇక్కడే ఉంటే కంపెనీ లాస్ లోకి వెళ్తుంది‌. అందుకే రాహుల్ ఆఫీస్ కి వెళ్తాడని రుద్రాణి అనగానే.. మా వీక్ నెస్ ని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నించకు ఆఫీస్ కి నేను ప్రకాష్ వెళ్తామని సుభాష్ అంటాడు. అదేంటి అన్నయ్య మీరంతా బాధలో ఉన్నారు కదా మేమేదో సహాయం చేద్దామని రాహుల్ ని కంపెనీకి పంపిద్దామని అనుకుంటున్నానని రుద్రాణి అంటుంది. రాజ్ లేడని అందరు బాధలో ఉంటే మీరేమో కంపెనీ గురించి ఆలోచించారా అని స్వప్న అంటుంది‌. ఇక అందరు కలిసి రుద్రాణిని తిట్టిపోస్తారు.

మరోవైపు కావ్య తన కార్ దిగి రాజ్ వెళ్తున్న కార్ వెంబడి పరిగెడుతుంది‌‌. కొంతసేపటికి కార్ ఒక దగ్గర ఆగుతుంది. ఇక కావ్య పరుగెత్తుకుంటూ రాజ్ దగ్గరి దాకా వెళ్ళి అలసిపోయి పడిపోతుంది. ఇక కమింగ్ అప్ లో కావ్యని రాజ్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. నన్ను జాయిన్ చేసిన ఆయన ఎక్కడున్నారని డాక్టర్ వాళ్ళని అడుగగా.. బిల్ కడుతున్నారని వాళ్ళు చెప్తారు. తీరా అక్కడి వెళ్ళగా రాజ్ వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంట్లో ఉన్న రుద్రాణి అందరితో మాట్లాడుతుంది. రాజ్ ఇక రాడు.. లేడు అని రుద్రాణి అనగా అప్పుడే ఉన్నాడు అంటూ కావ్య వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.