English | Telugu

Brahmamudi : అమ్మాయిలని అమ్మేసే రౌడీల చేతుల్లోకి కావ్య.. వాళ్ళు కాపాడుకోగలరా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -412 లో.... అప్పుకి కావ్య లొకేషన్ షేర్ చేస్తుంది.. ఇంకా ఎంత దూరమని కావ్య తనని తీసుకొని వచ్చిన ఆవిడని అడుగుతుంది. ఇంకాస్త దూరమని ఆవిడ అంటుంది. అప్పుడే రౌడీలు ఎదురుగా కార్ లో వచ్చి కావ్యని లోపలికి బలవంతం కగా ఎక్కిస్తారు. ఇంత మోసం చేస్తావా అని కావ్య తనని తీసుకొని వచ్చిన ఆవిడతో అనగానే.. మరి మేమ్ ఎలా బ్రతకాలి అని ఆవిడ అంటుంది. బలవంతంగా కావ్యని తీసుకొని వెళ్తుంటే.. అప్పు చూసి అక్కా అక్కా అంటూ కార్ వెంటే పరుగెడుతుంది.

ఆ తర్వాత రాజ్ కి ఆఫీస్ సెక్యూరిటీ ఫోన్ చేస్తాడు. మొన్న కావ్య మేడమ్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయిందంటూ హార్డ్ కాపీ తీసుకొని వెళ్లారు. మళ్ళీ ఇంకా హార్డ్ కాపీ తీసుకొని రాలేదని.. అందుకే కాల్ చేసానని సెక్యూరిటి చెప్పగానే అంటే కావ్య కి ఆ బాబు మా డాడ్ బాబు అని తెలిసి పోయింది అయినా సైలెంట్ గా వుంది అని అనుకుంటాడు.. మరొక వైపు కావ్య ని కిడ్నాప్ చేశారు అని అప్పు రాజ్ కి ఫోన్ చేస్తుంది.. అప్పుడే రాజ్ సెక్యూరిటీతో మాట్లాడతాడు.. ఆ తర్వాత రాజ్ ఫోన్ స్విచాఫ్ వస్తుంది. మరొక వైపు ఇంతసేపు మీ కూతురికి అన్యాయం జరిగిందని అడుగుతున్నారు.. నాకు జరిగిన అన్యాయం గురించి అడగరా అని కళ్యాణ్ అంటాడు. పెళ్లి అయిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా నేను ప్రశాంతంగా లేనని కళ్యాణ్ తన బాధని చెప్తాడు.

ఆ తర్వాత తనతో కలిసి ఉండలేను విడాకులు ఇస్తానని అనగానే అందరు షాక్ అవుతారు. అలా అంటే నీ తప్పు అవుతుంది. అర్థం చేసుకోవాలి సర్దుకుపోవాలని సీతారామయ్య అంటాడు. అప్పుడే అప్పు వస్తుంది. ఇప్పుడు అర్ధం అయింది. నాకు ఎందుకు విడాకులు ఇస్తాను అన్నాడో.. వీళ్ళు ఏదో ప్లాన్ లో ఉన్నారని అనామిక అంటుంది. అప్పుకి కోపం వచ్చి పదరా వాళ్ళు అనుకున్నదే నిజం చేద్దామని అప్పు అనగానే.. అందరు షాక్ అవుతారు. మరేంటి మీరు ఏదో గొడవ పెట్టుకుంటే.. పెట్టుకోండి నన్ను మధ్యలో లాగకండి అంటూ అప్పు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఇంతకి ఎందుకు వచ్చవ్ అని స్వప్న అడుగుతుంది.. రాజ్ బావ కోసం వచ్చానని అనగానే రాజ్ లేడని స్వప్న అంటుంది. ఆ తర్వాత అప్పు వెళ్తుంది. ఇక అప్పు విషయం తప్పుగా అర్థం చేసుకోకుండా బాగుండండి అని సీతారామయ్య చెప్తాడు. ఆ తర్వాత అప్పు గేట్ దగ్గర ఉంటుంది. రాజ్ రాగానే కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్తుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. తరువాయి భాగంలో ఇప్పుడు వాళ్ళని పట్టుకోకపోతే ఆ రౌడీ దుబాయ్ కి అమ్మాయిలని అమ్మేస్తారని రాజ్, అప్పులకి ఇన్ స్పెక్టర్ చెప్తాడు. ఆ తర్వాత ఆ రౌడీ లు కావ్యతో పాటు ఉన్న అమ్మాయిలని బలవంతంగా కార్ లో ఎక్కిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.