English | Telugu

అందరి ముందు ఆమె బుగ్గపై.. గంటల్లోనే యాభై వేలు!

స్టార్ మా సీరియల్స్ లలో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ కి ఉండే క్రేజే వేరు. రోజుకో ట్విస్ట్ తో ఓ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సీరియల్ ప్రోమో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యాభై వేల పైచిలుకు వ్యూస్ వస్తుంటాయి. దానికి కారణం ఈ సీరియల్ కథ. ఏ సీరియల్ అయిన కథ బాగుంటేనే సరైన హిట్ లభిస్తుంది. ఈ సీరియల్ లో సీతాకాంత్, రామలక్ష్మిల జంటకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

నిన్న మొన్నటిదాకా సిరి, ధనల ఇష్యూ సాగగా.. నేటి ప్రోమోలో రామలక్ష్మికి మరింత దగ్గరవుతాడు సీతాకాంత్. దాంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. మాణిక్యం వన్ మ్యాన్ షోగా సీతాకాంత్ ఎత్తులు ఓవైపు.. శ్రీలత తెగింపు మరోవైపు సాగుతుంది. గత జన్మలో ప్రేమించుకొని విడిపోయిన రామలక్ష్మి, సీతాకాంత్.. ఈ జన్నలోనైనా కలుస్తారా లేదా అనే కథాంశంతో మొదలైన ఈ కథ.. మొదటి ఎపిసోడ్ నుండి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అందులోను ఇద్దరి భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు.. అయితే రామలక్ష్మికి ముందుగానే అభి అనే బాయ్ ఫ్రెండ్ ఉండటంతో కథలో మెలిక మొదలైంది. అభి వాళ్ళింటికి సీతాకాంత్ వెళ్ళి అక్కడ అన్నీ విషయాలు తెలుసుకుంటాడు.

రెండు రోజుల నుండి సాగుతున్న ఎపిసోడ్ లలో.. అభి కోసం ఊటిలో రెసాట్ తీసుకున్నట్లు సీతాకాంత్ చెప్తాడు. అయితే అది అభి ఫేక్ అని అనుకోవాలని.. సీతాకాంత్ తన మేనేజర్ తో కాల్ చేపించి మాట్లాడిస్తాడు. ఇక అభి అది నిజమనుకొని సీతాకాంత్ ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకోకుండా డబ్బులు తీసుకుంటాడు. ఇక కాసేపటికి అతని చుట్టూ కొంతమంది వ్యక్తులు వచ్చి .. భయపెడతారు‌. మరోవైపు ఇంట్లో శ్రీలత, సందీప్ ల ముందు సీతాకాంత్, రామలక్ష్మి నాటకం ఆడుతుంటారు. వారిద్దరు నిజమైన భార్యాభర్తల లాగా నటిస్తుంటారు. ఇక కిచెన్ లో పిండి ఉందని.. దోశ వేయమని రామలక్ష్మిని సీతాకాంత్ చెప్తాడు. ఇక తను దోశలు వేస్తుండగా.. ఆమె బుగ్గకి కాస్త పిండి అంటుకుంటుంది. ఇక సీతాకాంత్ స్వయంగా తన చేతితో ఆ పిండిని తూడుస్తాడు. అది చూసి శ్రీలత, సందీప్ షాక్ అవుతారు. మరోవైపు రామలక్ష్మి నిజంగానే సీతాకాంత్ వైపు ప్రేమగా చూస్తుంది. ఇది నేటి ఎపిసోడ్ లో సూపర్ సీన్ గా మారనుంది. అసలేం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.