English | Telugu

నేను పిల్లల్ని కనలేను కదా.. అందుకే నా మీద ప్రేమ తగ్గిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -467 లో.. మురారి, కృష్ణతో మాట్లాడతాడు. ఏంటి కృష్ణ ఏం ఆలోచిస్తున్నావ్.? పర్వాలేదు చెప్పు అని మురారి అంటాడు. ఏం లేదు ఏసీపీ సర్.. మీకు నా మీద ప్రేమ తగ్గింది కదా? నేను పిల్లల్ని కనలేను.. గొడ్రాల్ని అని నా మీద ప్రేమ తగ్గిపోతుందా అని కృష్ణ అంటుంది. అయ్యో కృష్ణా ఏంటా మాటలు.. కొడతాను జాగ్రత్త... అలా ఎందుకు ఆలోచిస్తున్నావ్.. నీ మీద ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు. అయిన నువ్వు గొడ్రాలివి కాదు. ఆల్రెడీ మన బిడ్డ మరొకరి కడుపులో పెరుగుతోందని మురారి అంటాడు. ఆ మాటల మధ్యలోనే ఆదర్శ్, మీరాల పెళ్లి విషయం వస్తుంది. మన బిడ్డ బాగా పుట్టాలని ఆ దేవుడ్ని కోరుకుంటూ పూజ చేస్తున్నాం కదా. అంతా మంచే జరుగుతుంది సరేనా.. ఎక్కువగా ఆలోచించకు.. అప్పటితో ఈ ఇంట్లో అంతా శుభమే జరుగుతుందని మురారి అంటాడు. అప్పుడే ఎక్కడ? ఆదర్శ్, మీరాల పెళ్లి చెయ్యాలి కదా అని కృష్ణ అనగానే.. మురారి షాక్ అవుతాడు.

అదేంటి.. అదేం వద్దు. ఆ మీరా మంచిది కాదన్నావ్ కదా నువ్వే? తనకు దూరంగా ఉండాలని చెప్పి.. ఇప్పుడేంటి ఆదర్శ్‌తో పెళ్లి అంటున్నావని మురారి అంటాడు. అన్నాను.. మీరా అంత మంచిది కాదు. కానీ ఆదర్శ్, మీరాలు ఒకరిని ఒకరు ఇస్టపడుతున్నట్లే అనిపిస్తోంది. ఆదర్శ్ మనసులో అయితే మీరా ఉంది కదా.. పైగా మీరా పెళ్లి అయితే సెట్ అవుతుందేమో.. మంచిగా మారుతుందేమో కదా.. మనం అయితే ఆదర్శ్, మీరాల పెళ్లి చేయ్యాల్సిందేనని కృష్ణ అంటుంది. అమ్మో ఇప్పుడు కాదంటే.. కృష్ణకు డౌట్ వస్తుంది. రెండు నెలలు జాగ్రత్తగా సరే అనేసి గడిపితే.. మూడో నెలలో పిండం నిలబడిపోతుంది. మీరా గర్భవతి అన్న విషయం తెలిసి పెళ్లి కూడా ఆగుతుంది కదా అని మనసులో మురారి అనుకుంటాడు.

ఇక నిజంగానే మీరా కడుపుతో ఉన్న విషయం కృష్ణకు తెలిసిపోతుంది. కానీ పైకి చెప్పదు. అంతా బాగానే ఉంది అంటుంది. మీరా తల్లి కాబోతుందని ఎందుకు చెప్పడం లేదు? బహుశా పెళ్లి కాలేదు కాబట్టి చెప్పడం లేదేమోనని మురారి అనుకుంటాడు. మీరా కళ్ళు తెరవకుండా నటిస్తూనే ఉంటుంది. ఇక భవాని కంగారుగా వస్తుంది. అమృత ఒకసారి నువ్వు కూడా చూడు.. తనకు ఏమైందోనని అనడంతో.. అమృత కూడా చెక్ చేస్తుంది. మీరా ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసుకున్న అమృత నిజం చెబుతుందా? లేక కృష్ణ నిజం దాస్తుందని అర్థం చేసుకుని తనేం చెప్తుందనేది ఆసక్తిగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.