English | Telugu
Brahmamudi:అత్తలకి వార్నింగ్ ఇచ్చిన పెద్ద కోడలు.. చెల్లికి అక్క సపోర్ట్!
Updated : Jan 8, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -300 లో.. కావ్యని చూసిన కృష్ణమూర్తి.. ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. నువ్వు అసలు ఇక్కడికి ఇక ఎప్పటికి రాకు అనేసరికి.. కావ్యతో పాటు మిగతావాళ్ళు షాక్ అవుతారు. ఇప్పటికే స్వప్న వల్ల అప్పు వల్ల.. నీ అత్తారింట్లో నీ పరువు పోయి నిన్ను చులకనగా చూస్తున్నారని కృష్ణమూర్తి ఆవేదన గా మాట్లాడుతాడు. ఆ దుగ్గిరాల ఇంటి నుండి ఈ మట్టి బొమ్మలకు రంగులు వేసుకుని నా ఇంటికి రాకని కృష్ణమూర్తి చెప్తాడు.
ఏమైందయ్య నీకు.. కన్నకూతురిని ఎవరైనా అలా అంటారా అని కనకం అంటుంది. నీ వల్లే ఇదంతా భర్త చాటు భార్యలాగా ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండేది.. ఆకాశానికి నిచ్చెన వేసే నీ అలోచనలు ఉండడం వల్లే ఇదంతా అని కృష్ణమూర్తి అంటాడు. నేను వెళ్ళను కానీ కావ్యని రావద్దు అనడం కరెక్ట్ కాదని కనకం అంటుంది. నా పుట్టింటికి నేను ఎప్పుడైనా వస్తాను.. వెళ్తానని కావ్య తెగిసి చెప్పి వెళ్ళిపోతుంది. అలా మాట్లాడినందుకు కృష్ణమూర్తి తను వెళ్తుంటే బాధగా చూస్తాడు. మరొకవైపు అనామిక , కళ్యాణ్ లకి కొత్తగా పెళ్లి అయిందని ఇంట్లో సత్యనారాయణ వ్రతం చెయ్యడానికి దుగ్గిరాల ఇంట్లో ముహూర్తం చూడడానికి పంతులుని పిలిపిస్తారు. పంతులు వెళ్లిపోయాక కావ్య ఇంటికి వస్తుంది. ప్రొద్దున వెళ్ళావ్ ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావని అపర్ణ కోప్పడతుంది. మా పుట్టింటికి వెళ్ళానని కావ్య చెప్పగానే.. ఆ ఇంటితో ఏ సంబంధం పెట్టుకోవద్దని చెప్పాము కాదా అని ధాన్యలక్ష్మి అపర్ణ ఇద్దరు అడుగుతారు. ఇంట్లో పెద్ద వాళ్ళ మాటలు అంటే లెక్క లేదా అని అనామిక అంటుంది. మళ్ళీ ఏం ప్లాన్ చెయ్యడానికి వెళ్ళావని రుద్రాణి అనగానే.. అప్పుడే స్వప్న వచ్చి.. ఎందుకు ఎప్పుడు మా మీద, మా ఫ్యామిలీ మీద పడి ఏడుస్తావని రుద్రాణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.
ఆ తర్వాత తప్పు చేసామని అంటున్నారు కాదా కావ్య అనుకుంటే.. నిమిషం పట్టదు కళ్యాణ్, అప్పుల పెళ్లి చేయడానికి కానీ అలా ఏం చెయ్యలేదు మొదటి నుండి అనామిక, కళ్యాణ్ ల లవ్ కి సపోర్ట్ చేస్తూ పెళ్లి వరకు తీసుకొని వచ్చింది. ఎందుకు అలా తప్పు చేస్తుంటు కావ్యకి సపోర్ట్ గా స్వప్న మాట్లాడుతుంది. ఆ తర్వాత స్వప్నని కావ్య పక్కకి తీసుకొని వెళ్లి అలా మాట్లాడకూడదని చెప్తుంది. మరొకవైపు ముగ్గురు అత్తలు అయిన అపర్ణ, ధాన్యలక్ష్మ, రుద్రాణి కలిస కోడళ్ళు గురించి మాట్లాడుకుంటారు. అనామికని ఆ కావ్యకి దూరంగా ఉంచమని రుద్రాణి అనగానే.. నా కోడలు చాలా తెలివైందని ధాన్యలక్ష్మి అంటుంది. ఇలా ముగ్గురు కావ్య గురించి నెగెటివ్ గా మాట్లాడుకుంటారు. కావ్యకి అందరు నెగెటివ్ గా ఉన్నారని రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో కావ్య పూజకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంటే.. దీపం పెట్టేది రుద్రాణి కిందకి పడేసి కావ్యపై చెప్తుంది. దాంతో అందరు కావ్యని తిడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.