English | Telugu

విశ్వనాథ్ తో తన గతం గురించి రిషి చెప్పనున్నాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -865 లో.. రిషికి వసుధార ఫోన్ చేసి మహేంద్ర సర్ వాళ్లకి దెబ్బ తాకిందని చెప్పగానే రిషి కంగారుపడతాడు. సర్ బానే ఉన్నాడు? మీరు ఏం టెన్షన్ పడకండని వసుధార చెప్పి రిషిని రమ్మంటుంది. అదే విషయం లోపలికి వెళ్లి వసు జగతి మహేంద్రలకి.. రిషి సార్ వస్తున్నాడని చెప్తుంది.

ఆ తర్వాత మహేంద్రని చూసిన రిషి.. ఎలా ఉన్నారని అడుగుతాడు. మేడమ్ మీరు ఎలా ఉన్నారని అడగకుండా‌‌ జగతి గురించి కూడా మహేంద్ర నఢ అడుగుతాడు రిషి. బాగున్నాం రిషి, నువ్వేం టెన్షన్ పడకని రిషికి మహేంద్ర చెప్తాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని రిషి అడగగానే.. మీ విశ్వనాథ్ సార్ ఫోన్ చేసి, నీకు ఏంజిల్ కి పెళ్లి అని చెప్పి రమ్మని చెప్పారు. అసలు ఏం జరుగుతుంది రిషి అని మహేంద్ర అడుగుతాడు. దానికి రిషి సమాధానం చెప్పకుండా.. మీరు అవన్నీ ఇప్పుడు ఆలోచించకండని చెప్తాడు. వసుధార కాఫీ తెస్తానంటూ వెళ్తుంది. ఆ తర్వాత రిషి వచ్చి హాల్లో కూర్చొని ఉంటాడు. వసుధార కాఫీ తీసుకొని వస్తుంది. అసలు జీవితమేంటి ఇలా అవుతుందని రిషి బాధగా మాట్లాడతాడు. ఇవన్నీ కష్టాలు తొలగిపోవాలంటే మీరు ఇలా జరగడానికి గల కారణం తెలుసుకోవాలి? ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎవరు చేయిస్తున్నారు? మనవాళ్ళ వల్ల జరుగుతుందా అని తెలుసుకోవాలని వసుధార అనగానే రిషి కోపంగా వసుధార పైకి చెయ్యి ఎత్తుతాడు. మా వాళ్ళు ఎప్పుడు నా మంచి కోరుకునే వారే అంటూ వాళ్ళ వాళ్ళ వైపు సపోర్ట్ చేస్తాడు రిషి. ఆ తర్వాత వసుధార వాళ్ళ ఇంటి నుండి రిషి బయలుదేరి వెళ్లబోతుంటే వసుధార ఆపుతుంది. అయిన రిషి బలవంతంగా వెళ్లబోతుంటే రిషికి డోర్ మేకు గుచ్చకుంటుంది. అది చూసిన వసుధార వెంటనే రిషి చేతికీ కట్టు కడుతుంది. రిషి ఆ రోజు రాత్రి అక్కడే మహేంద్ర దగ్గర ఉంటాడు.

మరుసటి రోజు ఉదయం మహేంద్రకి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయబోయి మహేంద్ర పడిపోతుంటే రిషి వచ్చి పట్టుకుంటాడు. ఆ తర్వాత జగతి వచ్చి మేం చేసినవన్ని తప్పులే అని ఒప్పుకుంటున్నాం మమ్మల్ని క్షమించు అని రిషిని జగతి రిక్వెస్ట్ చేస్తుంది కానీ రిషి జగతి మాటలు పట్టించుకోడు. ఆ తర్వాత విశ్వనాథ్ మహేంద్రకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ రిషి లిఫ్ట్ చేసి మహేంద్ర వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళ దగ్గర ఉన్నానని చెప్తాడు. వాళ్ళని తీసుకొని రమ్మని విశ్వనాథ్ చెప్తాడు. ఆ తర్వాత విశ్వనాథ్ కి నిజం చెప్పమని జగతి అంటుంది. ఏమని చెప్తారని రిషి అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.