English | Telugu

Brahmamudi : రౌడీల గుప్పిట్లోకి కావ్య.. తన చెల్లి ఆమెను కాపాడగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -410 లో..అనామిక చేసిన పనికి కళ్యాణ్ తనని భార్యగా కూడా ఒప్పుకోవడం లేదు.. తనకి నచ్చినట్టు నేను ఎందుకు ఉండాలని కళ్యాణ్ ఆఫీస్ కి కూడా వెళ్ళనని చెప్తాడు... అందరు వెళ్లకుండా ఉంటే ఆఫీస్ పరిస్థితి ఏంటని అపర్ణ అడుగగా.. అది మీ సమస్య పెద్దమ్మ, అన్నయ్యనే ఆఫీస్ కి పర్ ఫెక్ట్ అని తెలిసి కూడా మీరు తనని ఆఫీస్ కి వద్దన్నారని కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ అంటూ అపర్ణ గట్టిగా అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తున్నావ్? కళ్యాణ్ అన్నదాంట్లో తప్పేముందని సుభాష్ అంటాడు.

అయోధ్యని ఎంతమంది ఏలిన దాన్ని రామరాజ్యం అన్నారు.. అన్నయ్య ప్లేస్ లోకి ఎవరు రాలేరని కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ వెళ్ళిపోతు.. నేను నాకు నచ్చినట్టు ఉంటాను ఆఫీస్ కి వెళ్ళనంటూ అనామికకి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాహుల్ ఆఫీస్ కి వెళ్తుంటే.. ఇక ఆఫీస్ పగ్గాలు నీ చేతిలోకి రాబోతున్నాయంటు రుద్రాణి అంటుంది. అప్పుడే స్వప్న వచ్చి.. అసలు ఇంట్లో వాళ్ళు నిన్ను నమ్మితే కదా అని రాహుల్ ని అంటుంది. రాహుల్, రుద్రాణిలకి స్వప్న సెటైర్ వేస్తుంటే రాహుల్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత సుభాష్ దగ్గరకి కావ్య వచ్చి.. మీతో ఈ విషయం డిస్కషన్ చెయ్యడం ఇబ్బందిగా ఉంది అయిన తప్పదని కావ్య అంటుంది. నాకు బాబు తల్లి విషయంలో డౌట్స్ ఉన్నాయని కావ్య అనగానే.. ఏంటని సుభాష్ అడుగుతాడు. బాబుని వదిలి ఆ తల్లి ఎందుకు ఉంటుంది ? ఎలా అంత చిన్నబాబుని వదిలిపెట్టి ఉంటుందని కావ్య అనగానే.. డబ్బు కోసం అని సుభాష్ చెప్తాడు. ఊటి బ్రాంచ్ లో నాకు సెక్రటరీగా ఉండేది.. ఒక వన్ ఇయర్ తర్వాత నేను తప్పు చేసానంటూ బాబుని తీసుకొని వచ్చింది. నెలనెలా పది లక్షలు పంపిస్తున్నానని సుభాష్ చెప్తాడు.. డబ్బులు పంపిస్తే సరిపోద్దా నాకు ఎందుకో అనుమానంగా ఉంది.. మీరు తన అడ్రస్ చెప్పండి అని కావ్య అడుగుతుంది. తెలియదని సుభాష్ అంటాడు. మీరు డబ్బులు పంపిన అకౌంట్ అడ్రస్ పంపండి అని కావ్య అనగానే.. సుభాష్ సరే అంటాడు.

మరొకవైపు అసలు ఈ మాయ మా జీవితంలోకి రాకుండా సెట్ చేయాలని రాజ్ అనుకొని బయలుదేరుతుంటే.. కావ్య కూడా ఎక్కడికో బయలుదేర్తుంది. నన్ను ఫాలో అవుతుందేమోనని రాజ్ అనుకుంటాడు.. కానీ కావ్య సుభాష్ పంపిన బ్యాంకు డీటెయిల్స్ బట్టి వెళ్తుంది. కావ్య వెళ్లి గల్లీలో వెతుకుతుంటే.. కొందరు రౌడీలు కావ్యని ఫోటో తీసి ఇంకో రౌడీకి పంపిస్తాడు. అమ్మాయి బాగుంది కిడ్నప్ చెయ్యండని వాడు చెప్తాడు. మరొకవైపు రాజ్ కూడా మాయ కోసం అదే గల్లీకి వస్తాడు. తరువాయి భాగంలో రాజ్ తన సెక్యూరిటీ ద్వారా కావ్య ఆఫీస్ కి వచ్చి.. హార్డ్ కాపీ తీసుకొని వెళ్ళిందని తెలుసుకుంటాడు.. మరొకవైపు కావ్యని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తుంటే.. అప్పు చూస్తుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.