English | Telugu

ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి...అంటున్న ఈతరం ఇల్లాలు

సోషల్ మీడియాలో అదృష్టం కానీ దురదృష్టం కానీ తన్నుకు రావాలంటే కచ్చితంగా ట్రోల్ కావాల్సిందే. ఐతే కొంత మంది అనుకోకుండా ట్రోల్ అవుతూ ఉంటారు. ఆ ట్రోలింగ్ కొందరికి అవకాశాలను తెచ్చిపెడుతుంది..కొందరిని పాతాళానికి తొక్కేస్తుంది. అలాంటి సమయంలో వాళ్ళు కోలుకోవడానికి చాలా సమయమే పడుతుంది. సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి... ఏదేమైనా ట్రోలింగ్ అనేది ఈరోజుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆ ఏదైతే అదయ్యిందిలే అని కొంతమంది ట్రోలింగ్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదేంటి ట్రోలింగ్ చేయించుకునేవాళ్ళా... ఎవరు అనుకుంటున్నారా. ఐతే అప్పుడెప్పుడో "ఈతరం ఇల్లాలు" సీరియల్ చూసి ఉంటారు కదా. ఆ సీరియల్ హీరోయిన్ దీపికా సింగ్ ... ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి అని బతిమాలుతోంది ఈ అందాల అమ్మడు.

ఈతరం ఇల్లాలు సీరియల్లో సంధ్య పాత్రలో అమాయకంగా కనిపిస్తూ తెలివైన అమ్మాయిగా నటించే పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీరియల్ తర్వాత మళ్లీ ఏ సీరియల్ చేయలేదు దీపికా సింగ్. పెళ్లి చేసుకుంది...చక్కగా పిల్లల్ని కన్నది...అలా కొంతకాలం కెరీర్ కి బ్రేక్ ఇచ్చేసింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి అమ్మడు తెగ సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ ఆ వీడియోస్ ని పోస్ట్ చేస్తోంది. ఇప్పుడు కూడా ఒక సాంగ్ కి డాన్స్ చేసి ఇన్ స్టాలో షేర్ చేసింది. “దీనికి యస్.. ఎందుకంటే ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతోంది. ప్లీజ్ ఇప్పుడు నన్ను ట్రోల్ చేయండి” అంటూ ఫన్నీగా టాగ్ లైన్ పెట్టుకుంది. నెటిజన్స్ ఐతే "బాగా చేస్తున్నారు...చేయండి...సంతోషాల్ని పంచండి అంటుంటే ఇంకొంతమంది ఎందుకు చేస్తున్నారు డాన్స్ చేయాల్సిన అవసరమేంటి అంటున్నారు. మెసేజెస్ చదివి రిప్లై ఇవ్వనప్పుడు మెసేజ్ సెక్షన్ క్లోజ్ చేసేయండి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మంగళ్ లక్ష్మి అనే హిందీ సీరియల్లో మంగళ్ పాత్రలో నటిస్తోంది దీపికా సింగ్ .

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.