English | Telugu

Nikhil Buzz: ఫేక్ మణికంఠ.. కన్నింగ్ బేబక్క.. స్ట్రాంగ్ నబీల్!

బిగ్ బాస్ సంబరం కాస్త ముగిసింది. మెజారిటీ పీపుల్స్ అనుకున్నట్టుగానే నిఖిల్ విన్నర్ అయ్యాడు. ఫినాలేలో ఆ ఇద్దరిలో ఎవరు గెలుస్తారని ఉత్కంఠభరితంగా సాగింది. నిఖిల్, గౌతమ్ మధ్య ఓటింగ్ లో గట్టి పోటీ జరుగగా నిఖిల్ గెలిచి.‌ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతులు మీదుగా బిగ్ బాస్ సీజన్-8 ట్రోఫీ అందుకున్నాడు.

నిఖిల్ ట్రోఫీని అందుకున్న తర్వాత స్టూడియో ముందు ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్త్ చేశారు. నిఖిల్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ(Biggboss Buzz) లో భాగంగా యాంకర్ అంబటి అర్జున్ తో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విన్నర్ అవ్వడం ఎలా ఫీల్ అవుతున్నావని యాంకర్ అడగగా.. అది ఊహకి అందనిదని నిఖిల్ అన్నాడు. అసలు ఇది ఊహించావా అని అడుగగా.. నేను మనసు పెట్టి ఆడానని నిఖిల్ అన్నాడు. నిన్ను చూస్తే ఒకటి చెప్పాలనిపిస్తుంది. తనని తాను చెక్కుకున్న శిల్పి అని నిఖిల్ ని యాంకర్ పొగుడుతాడు. నాగార్జున సర్ నా చెయ్యి పట్టుకొని పైకి లేపాక నేను షాక్ లో ఉండి పోయా అని నిఖిల్ తన ఫీలింగ్ ని చెప్పాడు. ట్రోఫీ గెలిచాక డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తానన్నావ్ .. ఇప్పుడు తన దగ్గర కి వెళ్తావా అని అర్జున్ సూటిగా నిఖిల్ ని అడుగగా.. బయటకు వెళ్ళాక సిచువేషన్ బట్టి అంటూ సమాధానమిచ్చాడు నిఖిల్. గౌతమ్ పై చాలా సార్లు అగ్రెసివే అయ్యావ్ ఎందుకని అని అడగ్గా.. తను కూడా నాపై చాలా సార్లు అగ్రెసివ్ అయ్యాడు

వందసార్లు మనది తప్పని చెప్పినప్పుడు మనోడిది కూడా ఒక్కసారి అయినా చెప్పాలి కదా అని నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు. హౌస్ మేట్స్ గురించి అడుగగా.. హౌస్ లో ఫేక్ మణికంఠ.. కన్నింగ్ బేబక్క.. స్ట్రాంగ్ నబీల్.. జెన్యూన్ పృథ్వీ అంటూ తన ఒపీనియన్ ని సూటిగా చెప్పాడు నిఖిల్. ఇక బిగ్ బాస్ నాగార్జున గురించి ఒక్క మాటలో పొగిడేసాడు.ఆ తర్వాత నిఖిల్ చే అర్జున్ కేక్ కట్ చేయించాడు. ఈ ప్రోమో చూస్తుంటే ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు చాలానే ఉంటారని తెలుస్తోంది. ఇలా మొత్తానికి ఈ సీజన్ విజవంతంగా ముగిసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.