English | Telugu

ఝాన్సీ ఎమోషనల్ పోస్ట్..రెస్పాండ్ అవుతున్న సెలెబ్స్

ఫస్ట్ జనరేషన్ యాంకర్ ఝాన్సీ గురించి అందరికీ తెలుసు. ఆమె బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఎన్నో మూవీస్ లో కూడా నటించింది. ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. అలాంటి ఝాన్సీ రీసెంట్ గా ఓ విషాద పోస్టు పెట్టారు. తన దగ్గర పనిచేసే శ్రీను అనే పర్సనల్ అసిస్టెంట్ 35 ఏళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌తో మరణించాడని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. "శ్రీను, శీను బాబు అని నేను ముద్దుగా పిలుచుకునేదాన్ని.

ఆటను నాకు మెయిన్ సపోర్ట్ సిస్టంగా ఉండేవాడు. అతను హెయిర్ స్టైలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి పర్సనల్ అసిస్టెంట్ గా ఎదిగాడు. నా పనిని చాలా సమర్థవంతంగా నిర్వహించేవాడు. అతను సున్నిత మనస్కుడు, జెన్యూన్ గా, చాల మంచి హ్యూమరస్ పర్సన్ కూడా. అతన్ని నేనొక తమ్ముడి లెక్క చూసుకుంటాను. ఇంత చిన్న వయసులో గుండె పోటుతో మరణించడం నాకు చాల బాధను కలిగిస్తోంది.జీవితం ఒక బుడగలాంటిది" అని సుదీర్ఘ మెసేజ్ ని పెట్టారు. ఝాన్సీ పోస్ట్ మీద హంసానందిని హార్ట్ బ్రోకెన్ అన్నారు, యాంకర్ శిల్పా స్పందిస్తూ షాకింగ్ అని కామెంట్ పెట్టింది. మీకు జరిగిన నష్టానికి సారీ, ఓం శాంతి అంటూ అడివి శేష్ కామెంట్ చేశాడు.

సో స్యాడ్ అంటూ సురేఖా వాణి, ఓం శాంతి అంటూ ప్రగతి ఇలా చాలా మంది సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. అనిత చౌదరి వాట్ ఆర్ యు టాకింగ్...లయ ఐ యాం సారీ అంటూ రెస్పాండ్ అవుతున్నారు. ఇక గాయత్రీ భార్గవి రియాక్ట్ అవుతూ.. ఇది చాలా షాకింగ్‌గా అనిపిస్తోంది.. చాలా దారుణం.. ఆయన చాలా నిజాయితీ గల మనిషి.. నా కెరీర్ ప్రారంభంలో నేను ఆయన్ని చూసాను.. గత వారమే ఆయన్ను కలిశాను.. జీవితం ఊహాతీతం అంటూ ఎమోషనల్ అయింది. సారీ ఝాన్సమ్మ అంటూ నందినీ రెడ్డి ఇలా సెలెబ్రిటీలంతా అంతా కూడా మెసేజెస్ పోస్ట్ చేసి స్పందిస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.