English | Telugu
బిగ్ బాస్ సీజన్-7 ఎపిసోడ్-38 రివ్యూ!
Updated : Oct 12, 2023
బిగ్ బాస్ సీజన్-7 అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక హౌజ్ లోకి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. అందులో అయిదుగురు ఎలిమినేట్ అయ్యారు. గతవారం 2.0 గా మరో అయిదుగురు కొత్త కంటెస్టెంట్స్ లోపలికి వచ్చారు.
కొత్త కంటెస్టెంట్స్ లోని అంబటి అర్జున్ పాతవాళ్ళని డామినేట్ చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి కండబలంతో పాటు బుద్ది బలం కూడా ఉందని నిన్న జరిగిన రాకెట్ టాస్క్ లో తెలిసి పోయింది. ఇంత అందమైన అమ్మాయిని, ఇంత పనిచేసే అమ్మాయిని, నీ చిరునవ్వుని చూస్తే చాలు, పొద్దున్నే పాల ప్యాకెట్ అవసరం లేదు నీ పాలబుగ్గలు ఉంటే చాలు. బయటకెళ్ళాక నేను హీరోగా నువ్వు హీరోయిన్ గా చేస్తే బాగుండు అనేంత అంత బాగున్నావని భోలే శావలి అనగా.. వద్దు వద్దురా బాబు అని అశ్విని శ్రీ అంది. టోటల్ గా మస్తు ఉంటావ్ రా అని అశ్విని శ్రీని అంటూ భోలే శావలి తన పులిహోర ఆపేశాడు.
ముప్పై ఎనిమినదవ రోజు అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటతో మొదలైంది. ఇక వాష్ రూమ్ దగ్గర అమర్ దీప్, ప్రియాంక జైన్ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ఈ రోజు ఎలాగైనా ఆడతా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అని అమర్ దీప్ అన్నాడు. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళు, నీ మీద నీకు అంత కాన్ఫిడెంట్ లేనప్పుడు ఎందుకు వెళ్ళావని ప్రియాంక జైన్ అంది.
ఇక ఆ తర్వాత ఏదో ఒకటి ఆడాలని దూకావు, కానీ పెద్ద మైనస్ అయిందని టేస్టీ తేజ అనగా.. సరే అది పోనీయ్ రా, ఇప్పుడు మైనస్ ల గురించి మాట్లాడుకుంటే ఏం రాదని అమర్ దీప్ కవర్ చేసుకున్నాడు. అందరూ నిన్ను వద్దని ప్రశాంత్ ని పంపించాలని అనుకున్నారంటే.. వాడు ఆల్రెడీ గేమ్స్ ఆడాడు. వాడి ఆట చూసారు. ఇప్పుడు మా ఆట కదా జనాలు చూడాల్సిందని అమర్ దీప్ అన్నాడు.
ఆ తర్వాత గౌతమ్ కృష్ణతో భోలే శావలి బాస్కెట్ల మీద బిస్కెట్లు వేశాడు. దాన్ని నిజమే అని నమ్మిన గౌతమ్.. భోలే శావలికి థాంక్స్ చెప్తూ హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత గౌతమ కృష్ణకి స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఇంట్లోని ఆహారాన్మియ, రేషన్ ని వేస్ట్ చేయకుండా ఉండేలా చూసుకోవాలని గౌతమ్ కృష్ణకి బిగ్ బాస్ చెప్పగా.. ప్రియాంక, ఆట సందీప్ ని డిప్యూటీగా తీసుకున్నాడు. ఆ తర్వాత క్లీనింగ్ కి యావర్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ లకి స్క్రబ్బర్ ఇచ్చాడు గౌతమ్ కృష్ణ.
ఇక మోనిత తన నిజస్వరూపం బయటపెట్టింది. నాకు డిప్యూటీ ఇవ్వకుండా క్లీనింగ్ ఇచ్చావ్ కదా అని మనసులో పెట్టుకొని ప్రియాంక, గౌతమ్ కృష్ణలతో రూడ్ గా ప్రవర్తించింది. కిచెన్ లో చాలా సేపు గొడవ జరిగింది. ఇక ఆ తర్వాత టాస్క్ లు కొనసాగాయి. మొదటి టాస్క్ లో ఆటగాళ్ళ టీమ్ గెలవగా, రెండవ టాస్క్ లో పోటుగాళ్ళ టీమ్ గెలిచింది. ఇక ఇప్పటిదాకా జరిగిన టాస్క్ లలో.. 3-1 తో పోటుగాళ్ళు లీడింగ్ లో ఉన్నారు. మరి కొత్తగా వచ్చిన హౌజ్ మేట్స్ నుండి కెప్టెన్ అవుతాడా లేక పాత హౌజ్ మేట్స్ నుండి కెప్టెన్ అవుతాడా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.