Read more!

English | Telugu

హౌజ్ లో శివాజీ టాప్ అయితే ఓటింగ్ లో యావర్!


బిగ్ బాస్ సీజన్-7 లో రోజు రోజుకి ఆటతీరుతో, మాటతీరుతో కంటెస్టెంట్స్ ఇరగదీస్తున్నారు. కెప్టెన్సీ రేస్ ఆసక్తికరంగా సాగుతుంది.

కొత్త హౌజ్ మేట్స్ రావడంతో ఇప్పటిదాకా రెండు గ్రూప్ లుగా ఉన్నవాళ్ళంతా కలసిపోయినట్టు అనిపిస్తుంది. అయితే సీరియల్ బ్యాచ్ మాత్రం సపరేట్ గా వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అమర్ దీప్ బాగా "లో" గా ఫీల్ అవుతున్నట్టు తనకి అనిపిస్తుందని అందరితో చెప్పుకుంటూ సానుభూతి పొందాలని చూస్తున్నాడు. అయితే నక్క ఎంత దీన స్థితిలో ఉన్నా సానుభూతి చూపించొద్దని తర్వాత నిమిషమే అమర్ దీప్ ప్రూవ్ చేస్తున్నాడు.

నిన్న జరిగిన టాస్క్ లో బిగ్ బాస్ చెప్పిన కలర్ గల వస్తువులని తీసుకురమ్మని చెప్పినప్పుడు.. అశ్విని శ్రీ దగ్గర వస్తువులని లాగేసుకొని ఫౌల్ గేమ్ ఆడాడు. ఆ తర్వాత ఆట‌ సందీప్, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి కలిసి గుసగుసలు పెట్టుకున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జ్ లాగేసుకున్నాక శివాజీ ఎమోషనల్ అయ్యాడు.

శివాజీ ప్రతీ గేమ్ ని ఇంటలిజెన్స్ తో పాటు ఫెయిర్ గేమ్ ఆడాలని చెప్తూ వస్తున్న ఈ ఆట సందీప్, అమర్ దీప్ ఫౌల్ గేమ్స్ ‌ఆడుతున్నారు. లేదంటే ఆటగాళ్ళ టీమ్ ఇప్పుడు నెంబర్ వన్ ఉండేది. కానీ శివాజీ ఫెయిర్ గేమ్ వల్లనే ఆటగాళ్ళ టీమ్ ఇంకా కెప్టెన్సీ రేస్ లో నిలిచింది. ఇక నామినేషన్లో యావర్ టాప్ లో ఉన్నాడు. కొత్తగా వచ్చిన ‌హౌజ్ మేట్స్ లో పూజా మూర్తి, అశ్విని శ్రీ చివరి స్థానాలలో ఉండగా.. శోభా శెట్టి, ప్రియాంక జైన్ స్వల్ప ఓటింగ్ తేడాతో కొనసాగుతున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.