English | Telugu

Bigg boss 9 Telugu Nominations: మూడో వారం నామినేషన్లో ఉన్నది ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 మూడో వారం నామినేషన్లతో హౌస్ అంతా హీటెక్కెపోయింది. దమ్ము శ్రీజని సంజన నామినేట్ చేసింది. నీ వల్ల హౌస్ ఆర్మని డిస్టబ్ అవుతంటూ తన నామినేషన్ చెప్పింది. ఎక్కడో చెప్పమని శ్రీజ అడుగగా. ‌ సరిగ్గా స్టాండ్ తీసుకోవని, అనవసర విషయాలకి మాట్లాటతావని సంజన చెప్పింది. ఇక డీమాన్ పవన్ ని హరీష్ నామినేట్ చేసి తన పాయింట్లు చెప్పుకొచ్చాడు.

నిస్పక్షపాంగా అందరి విషయంలోనూ ఉండాలి.. మనకి ఫ్రెండ్‌షిప్ ఉన్న వాళ్లతో ఫ్రెండ్లీగా ఉన్నవాళ్లతో మాత్రం ఒకరకమైన సాఫ్ట్ టోన్.. సాఫ్ట్ కార్నర్.. మనకి ఎవరితో అయితే రిలేషన్ లేదో వాళ్లతో మాత్రం ఒక రకంగా.. ఇదే దోగ్లా పని అంటారు దీన్నే .. డబుల్ స్టాండర్డ్స్.. అంటారంటూ డీమాన్ పవన్ తో హరీష్ చెప్పాడు. సరే మీరు మాట్లాడుకోండి అని డీమాన్ అనేసరికి హరీష్ కి ఇంకా కోపం పెరిగిపోయింది. నిజాలు మాట్లాడుకుందాం.. మాట్లాడుకునేటప్పుడు గుడ్డలు ఇప్పదీసుకొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా.. మీకు కంటిముందు జరిగేదే కళ్లు మూసుకుంటాయి మీకు పొరలు.. రీతూ విషయంలో కళ్లు మూసుకుపోతాయి మీకు.. మీరెళ్లి చాక్లెట్లు ఇచ్చి కెప్టెన్సీ ఇలాంటి లత్కోర్ పనులు నేను చేయను అర్థమైందా..అంటూ హరీష్ ఫైర్ అయ్యాడు. ఈ మాట అనగానే బయట టీవీలో ఇదంతా చూస్తున్న రీతూ ఉలిక్కిపడింది. అది లత్కోర్ పని కాదు సర్ అని డీమాన్ పవన్ అన్నాడు. మరేంటది.. వేశారు కదా చూపించారు కదా.. నేషనల్ టెలివిజన్‌లో అర్థమైందిగా ఏం జరిగిందో మనం ఎంత పక్షపతంగా ఉంటామో ఎంత ఫెయిర్‌గా ఉంటామో కనబడుతుంది పవన్.. అంటూ హరీష్ అన్నాడు. సర్ ఆమెని నామినేట్ చేయొద్దని నేను చెప్పలేదంటూ డీమాన్ అన్నాడు. దీనికి అవును నామినేట్ చేయొద్దని చెప్పను కానీ ఇంకొకళ్లు అంటే ఏంటి దో ఛాయ్ కాన్సెప్ట్ అంటూ డీమాన్‌ పై అరిచేశాడు హరీష్. ఇంతలో సర్ మీరు అన్న వర్డ్ రాంగ్ అంటూ ప్రియ చెప్పింది. మీకన్నా కాదు అని హరీష్ అనగానే లత్కోర్ అన్న పదం కరెక్ట్ కాదంటూ శ్రీజ కూడా రెయిజ్ చేసింది. దీంతో తప్పేం కాదది బూతా.. బెట్ కాస్తారా..బూతా అది.. మీరు చెప్పండి దాని మీనింగ్ అంటూ హరీష్ ఫైర్ అయ్యాడు. అది బ్యాడ్ వర్డ్ అని శ్రీజ అంది. బ్యాడ్ వర్డ్ ఎలాగా.. మీనింగ్ చెప్పండి.. పులిహోర పంచాయితీ లాంటిది అర్థమైందా.. అంటే ఏంటి మీకు వినసొంపుగా ఉన్నాయి నేను మాట్లాడతానా అంటూ రివర్స్‌లో ఫైర్ అయ్యాడు హరీష్. చివరికి తన ఫోటోనే నామినేషన్స్ పెట్టేయాలని హరీష్ చెప్పాడు.

కామనర్స్ నామినేషన్లు పూర్తవ్వగానే సెలెబ్రిటీస్ వి మొదలయ్యాయి. మొదటగా దమ్ము శ్రీజని సంజన నామినేట్ చేసింది. ఇద్దరి మధ్య హీటెడ్ డిస్కషన్స్ జరిగాయి. ఇమ్మాన్యుయల్ ముందుగా పవన్ కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. ఎక్కువమందితో మాట్లాడట్లేదు.. ఇంకా సరైన గేమ్ చూపించలేదని పాయింట్లు చెప్పాడు. తర్వాత ప్రియని నామినేట్ చేశాడు ఇమ్మాన్యుయల్. శ్రీజ, సంజన మధ్య డిస్కషన్స్ లో రీతూ చౌదరి దూరింది. దాంతో రీతూ, శ్రీజ మధ్య కూడా చిన్న గొడవ అయింది. ఇలా నామినేషన్స్‌ పూర్తయ్యే సరికి బోర్డ్ మీద పవన్ కళ్యాణ్, ప్రియ, శ్రీజ, హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా, రాము రాథోడ్ ఫొటోలు ఉన్నాయి. అప్పుడే బిగ్‌బాస్ ఓ అనౌన్స్‌మెంట్ చేశాడు. డీమాన్ కెప్టెన్ అయిన కారణంగా మీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాం.. నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో ఒకర్ని మీరు సేవ్ చేయొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. దాంతో అతను దమ్ము శ్రీజని సేవ్ చేశాడు. అది చూసి రీతూ చౌదరి హర్ట్ అయింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.