English | Telugu

పృద్వి కోసం విష్ణు ప్రియ...ఆ షోకి అందుకే వెళ్లాను!

బిగ్ బాస్ లో రొమాంటిక్ కపుల్ గా విష్ణు ప్రియా - పృథ్వి జోడి మంచి పేరు తెచ్చుకుంది. ఒకరు లేకపోతె ఇంకొకరు లేరు అన్నట్టుగా ఉండేవాళ్ళు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక పృథ్వి విష్ణు ప్రియను పట్టించుకోవడం మానేసాడు. విష్ణు ప్రియా మాత్రం పృద్వి జపం చేస్తూ ఉంటుంది. కానీ అతను ఇద్దరం ఫ్రెండ్స్ అని మాత్రమే అనేవాడు. అలాంటి పృద్వి గురించి విష్ణు ప్రియా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పింది . "కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో గురించి చెప్పాలంటే ఎం చెప్తావ్" అని విష్ణు ప్రియను హోస్ట్ అడిగింది. "నాకు దేవుడు రెండు సార్లు షోకి వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ సీజన్ లో బేవార్సు వాళ్ళతో ఫ్లర్ట్ చేసాను.

సెకండ్ సీజన్ లో నాకు ఇష్టమైన అబ్బాయి ఉన్నాడు...డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అతన్ని చూడడం కోసమే వెళ్లాను. ఈ విషయాన్నీ నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. నేను పృద్వి కోసం ఈ షో సెకండ్ సీజన్ కి వెళ్లాను. అక్కడ మర్చిపోలేని ఇన్సిడెంట్స్ అంటే షూటింగ్ కి ముందు మేము ఛిల్ల్ అయ్యేవాళ్ళం..షూటింగ్ మధ్యలో నేను పృథ్వి కోసం బర్గర్స్ వంటివి ఆర్డర్ పెట్టి తెప్పించేదాన్ని. ఇక నిఖిల్ కూడా ఇదంతా చూసి పృథ్వికె ఇస్తావా అనేవాడు ఇక అతనికి నా బర్గర్ ఇచ్చేసేదాన్ని. అలా ఆ షో టైంలో కలిసి ఫుడ్ తినేవాళ్ళం. ఫైటింగ్ చేసుకునే వాళ్ళం. ఆ పృథ్వి ఐతే గేమ్ ని గేమ్ లానే ఆడాలి అనేవాడు." అంటూ పృద్వి గురించి చెప్పింది విష్ణు ప్రియా.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.