English | Telugu

Bigg Boss 9 Telugu : తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్స్ రేస్ లో నిలిచింది వీళ్లే!

బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా మూడు టీమ్ లు పోటీపడుతున్నాయి. అందులో రెబల్స్ కి సీక్రెట్ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. సీక్రెట్ టాస్క్ లు పూర్తి చేసిన వారికీ బిగ్ బాస్ డైరెక్ట్ కంటెండర్స్ ని చేసారు. అయితే రీతూ సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అవ్వడంతో డైరెక్ట్ కంటెండర్ అవలేకపోయింది.

ఎవరు అయితే రెబల్స్ అని అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పమని బిగ్ బాస్ చెప్పగా అందరూ గౌరవ్, ఇమ్మాన్యుయల్, రీతూ అని చెప్తారు. అయితే బిగ్ బాస్ చివరికి అసలైన రెబల్స్ ని రీవీల్ చేస్తాడు. సుమన్, దివ్య డైరెక్ట్ కంటెండర్స్ అని బిగ్ బాస్ చెప్పాడు. నిఖిల్, కళ్యాణ్, శ్రీనివాస్ సాయి వీళ్లంతా రెబల్స్ తో కిల్ అయ్యారు. సంజన ముందు నుండే టాస్క్ లో లేదు. గౌరవ్ కెప్టెన్సీ టాస్క్ నుండి రిమూవ్ అయ్యాడు. ఇమ్మాన్యుయల్, రాము, భరణి, తనూజ, రీతూ. అయిదుగురు చర్చించుకొని ఒకరు రిమూవ్ చేయాలని నలుగురు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు‌.

ఇక అయిదుగురు డిస్కషన్ చేసుకుంటారు. ఆల్రెడీ రాము, ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయ్యారు కాబట్టి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రం తప్పుకోండి అని భరణి చెప్తాడు. నేను రిమూవ్ అవుతున్నానని రాము చెప్తాడు. ఏంటి నువ్వు ఇలా ప్రతీదానికి త్వరగా గివప్ ఇస్తున్నావ్.. ఆర్గుమెంట్స్ చెయ్యాలి కదా.. నీ ఛాన్స్ కోసం నువ్వు మాట్లాడాలని రాముతో తనూజ అంటుంది. అయిన రాము సైలెంట్ గా ఉంటాడు. తనూజ, భరణి, దివ్య, సుమన్, రీతూ, ఇమ్మాన్యుయల్ ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఉన్నారు. భరణి దగ్గరికి తనూజ వెళ్లి కెప్టెన్సీ టాస్క్ లో హెల్ప్ చెయ్యమని అడుగుతుంది. మరి వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి మరి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.