English | Telugu

Bigboss 8 Telugu : ఈసారి బిగ్ బాస్ హిట్టా? ఫట్టా?

బిగ్ బాస్ గ్రాంఢ్ లాంఛ్ ఆదివారం రోజు అట్టహసంగా మొదలు అయింది. ఈ సీజన్ అన్ని సీజన్ కంటే డిఫరెంట్ గా లిమిట్ లెస్ గా ఉండబోతుంది. కంటెస్టెంట్స్ హౌస్ లోకి 14 మంది ఎంట్రీ ఇచ్చారు. అందులో సగానికి సగం మంది జనాలకి తెల్సి ఉండరు. ఈ సారి సింగింగ్ కి సంబంధించిన ఒక్క కంటెస్టెంట్ కూడా లేరు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ కూడా జరగలేదు.

కంటెస్టెంట్స్ లో ఇద్దరు, ముగ్గురు కొంచెం నాగార్జునని కాకా పట్టాలని ట్రై చెయ్యడానికే వచ్చినట్లు అనిపించింది. బెజవాడ బేబక్క స్టేజి మీద కొంచెం ఓవర్ అనిపించిన, బాషా వచ్చాక ఇద్దరికి ఇద్దరు సరిపోయారు అన్నట్లు ఉంది. ఇక స్టార్ మా టీవీలో‌ వచ్చిన 'కృష్ణ ముకుంద మురారి' హీరయిన్స్ యష్మీ గౌడ, ప్రేరణ కుంభం ఇద్దరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సెలెబ్రిటీలుగా రానా దగ్గుబాటి, నివేతా థామస్ హౌస్ లోకి జంటగా వెళ్లి.. వాళ్ళతో గేమ్స్ ఆడించారు. ఆ తర్వాత నాని తన న్యూ మూవీ హీరోయిన్ తో కలిసి హౌస్ లో ఎంట్రీ ఇచ్చి గేమ్ అడించాడు. హౌస్ లోకి పద్నాలుగు మంది ఎంట్రీ అయ్యాక డైరెక్టర్ అనిల్ రావిపుడిని హౌస్ లోకి పంపించగా హౌస్ లో మొదటి రోజే ఫిట్టింగ్ పెట్టాడు. ఒకరిని నాతో తీసుకొని వెళ్లి వేరే వాళ్ళని స్వాప్ చేస్తానని అందరి కంటెస్టెంట్ ఒపీనియన్ అడుగుతాడు. అందరూ నాగ మణికంఠ పేరు చెప్పగా.. అప్పుడే అందరిపై తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు. ఆ తర్వాత నాగ మణికంట ఏడుస్తుంటే ఫ్రాంక్ అని అనిల్ రావిపుడి చెప్తాడు. కానీ అందరు అతని పేరు చెప్పారన్న కోపం మాత్రం మణికంఠ ఫేస్ లో కన్పించింది. ఇక నామినేషన్ కి నాంది పలికినట్లే.

ఈ సీజన్లో నో కెప్టెన్, నో రేషన్ అంట ఎవరు సంపాదించుకున్నంత వాళ్లకు.. అంతేకాకుండా ప్రైజ్ మనీ కూడా జీరో.. అది కూడా వాళ్లు అడే గేమ్ ని బట్టి నెంబర్ మారుతుంది. మరి వచ్చిన కంటెస్టెంట్స్ లో‌ మీ ఫేవరెట్ ఎవరు? ఈ సీజన్ హిట్ అవుతుందా లేదా మీ ఒపినీయన్ కామెంట్ చేయండి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.