English | Telugu

ఒంటిపై ఆ టాటూ మీనింగ్ చెప్పిన బ్యూటీ!


సోషల్ మీడియాలో కొందరు మరీ పర్సనల్ విషయాలని కూడా షేర్ చేసుకుంటున్నారు. సినిమా తారల నుండి సీరియల్ నటీనటుల వరకు అందరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కొన్ని సందర్భాలలో నెటిజన్లు వారిని ట్రోల్స్ చేసినప్పుడు గానీ ఏదైనా అడిగినప్పుడు గానీ కొందరు రియాక్ట్ అవుతారు. అందులో తాజాగా బుల్లితెర నటి భావన లాస్య ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

మల్లిగా అందరికి పరిచయమైన భావన లాస్య.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. భావన తండ్రి రైల్వే ఉద్యోగి. కరోనా లాక్ డౌన్ సమయంలో తను చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి విశేషమైన స్పందన రావడంతో, మల్లి సీరియల్ మేకర్స్ తనని సంప్రదించగా తను నటించడానికి ఒకే అంది.‌ ఇప్పటివరకు టెలివిజన్ సీరియల్స్ లో నటించిన భావన లాస్యకి 'మల్లి' తన తొలి తెలుగు సీరియల్. కాగా ఇందులో భావన లాస్య ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. భావన లాస్య ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా రీల్స్ షేర్ చేస్తుంది.

టీవి యాక్టర్స్ ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అవుతున్నారు. అందులో బ్రహ్మముడి సీరియల్ టీమ్ టాప్ లో ఉన్నారు. కాగా ఇప్పుడు మల్లి సీరియల్ లోని భావన లాస్య కూడా చేరింది. నెటిజన్లతో కాసేపు చిట్ చాట్ చేసింది ఈ భామ. అందులో ఓ నెటిజన్ టాటూస్ మీనింగ్ అని అడగ్గా.. సెమికాలన్ ఈజ్ రియల్లీ పర్సనల్, ఏ ఇష్యూ అయిన ఫుల్ హోప్ తో అధిగమించవచ్చు అని భావన లాస్య అంది. మరో టాటుకి అర్థం ఏంటంటే.. లవ్ ఇన్ అరబిక్.. డవ్ ఈజ్ పీస్ అని రిప్లై ఇచ్చింది. ఖాళీ సమయంలో ఏం చేస్తావని ఓ నెటిజన్ అడుగగా.. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చూస్తానని చెప్పుకొచ్చింది ఈ భామ. భావన లాస్యకి ఇన్ స్టాగ్రామ్ లో 295K ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో తను ఏం చేసిన ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ టాపిక్ నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.