English | Telugu

Karthika Deepam2 : ఫాధర్స్ డే రోజు శౌర్య కోసం కార్తిక్ రాగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -82 లో.....శౌర్య బొమ్మ చేసి ఇది నాన్న అని దీపకి చూపిస్తుంది. నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళకు నాతోనే ఉండమని శౌర్య అంటుంది. ఆ మాటలు చూసి.. దీప ఎమోషనల్ అవుతుంది. నీకు తండ్రి అయిన తల్లి అయిన నేనే అని దీప అనుకుంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్లి.. నీ అత్త ఇంట్లో దీప ఉంది వెళ్లేసరికి అని చెప్తుంది. దాంతో జ్యోత్స్న కోపంతో ఊగిపోతుంది.

స్కూల్ హోటల్ ఇక ఇవన్నీ అందరికి తెలిసిపోయాయని ఏకంగా ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు మీ బావ.. అసలు నీ అత్తకు బాగోలేదని నీకు తెలుసా.. అలాంటిది దీపకి ఎలా తెలుసు.. కార్తీక్ చెప్పాడు.. దీప వెళ్లి నీ అత్తకు వంట చేసి పెట్టింది. నువ్వు పాలు పొంగించేలోపు అది ఏకంగా ఎసరు పెట్టి వచ్చిందని జ్యోత్స్నని పారిజాతం రెచ్చగొడుతుంది. ఇంట్లో నువ్వు చూసుకో దాని సంగతి అని పారిజాతం అనగానే.. నేను చూసుకుంటానని జ్యోత్స్న చెప్తుంది. మరొకవైపు నీకు జ్యోత్స్నకి పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టుకుందామని నాన్న, పిన్ని వచ్చారని కార్తిక్ తో కాంచన చెప్తుంది. ఇప్పుడే వద్దని కార్తీక్ అనగానే.. అసలు నీ మనసులో ఏముందో చెప్పమని కాంచన అడుగుతుంది. నాకు జ్యోత్స్న అంటే ఇష్టం లేదని కార్తీక్ చెప్పబోతుంటాడు. అప్పుడే శౌర్య ఫోన్ చేసి.. స్కూల్లో జరిగే ఫాథర్స్ డే సెలెబ్రేషన్స్ కి రమ్మని చెప్తుంది. దానికి కార్తీక్ సరే అంటాడు. ఆ విషయం కాంచనకి చెప్తాడు. శౌర్యకి నువ్వు అంటే ఇష్టం రా తనని బాధపెట్టకు.. వెళ్లి కన్పించి రా అని చెప్పగానే.. నువు మాత్రమే నన్ను అర్థం చేసుకుంటావని కార్తీక్ అంటాడు. దీప వచ్చింది.. వంట చేసిందని కార్తీక్ కి చెప్తుంది కాంచన‌.

మరొకవైపు దీప, శౌర్య, సుమిత్ర ఇంటికి వస్తారు. దశరథ్ ని శివన్నారాయాణ పక్కకి తీసుకువెళ్ళు అని అంటాడు. శౌర్య చాక్లెట్ ఇచ్చి ఈ రోజు ఫాదర్స్ డే కదా విషెస్ చెప్పండి అని చెప్పగానే.. దశరథ్ తన తండ్రికి విషెస్ చెప్పి ఆశీర్వాదం తీసుకుంటాడు. జ్యోత్స్న కి కూడా శౌర్య చాక్లెట్ ఇచ్చి అలాగే చెయ్యమని చెప్తుంది. అందరికి విషెస్ చెప్పమంటున్నావ్.. మీ నాన్నకి చెప్పవా అంటూ పారిజాతం అడుగుతుంది‌. దాంతో పారిజాతంపై సుమిత్ర కోప్పడుతుంది. మీరు ఇద్దరే వెళ్తున్నారా స్కూల్ కి అని పారిజాతం అనగానే.. లేదు కార్తీక్ వస్తున్నాడని శౌర్య చెప్తుంది. దాంతో పారిజాతం కోప్పడుతుంది. నువ్వు ముందు అలా ఎందుకు అడిగావంటూ పారిజాతాన్ని శివన్నారాయణ తిడుతాడు. బావ ఎలా వెళ్తాడో నేను చూస్తానంటూ జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత దీప, శౌర్యలు స్కూల్ వెళ్లి కూర్చుంటారు. అప్పుడే జ్యోత్స్న వచ్చి.. వాళ్ళ పక్కన కూర్చుంటుంది. నేనే శౌర్య బాధ్యతలు తీసుకున్నాను కదా.. నేను తప్ప ఇక ఎవరు రారని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.