English | Telugu

గుప్పెడంత మనసు అభిమానుల కామెంట్ల మోత.. యూట్యూబ్ లో ట్రెండింగ్!

కొన్ని కథలకి , సినిమాలకి ఫ్యాన్స్ ఉంటారు. కానీ సీరియల్ లోని క్యారెక్టర్లకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అవ్వడం ఇదే తొలిసారి. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు'.

ఈ సీరియల్ లోని రిషి, వసుధారల ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ కి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. ఎంతలా అంటే గుప్పెడంత మనసు సీరియల్ ప్రోమో యూట్యూబ్ లో విడుదలైన అయిదు గంటలకే లక్ష యాభై వేల వ్యూస్ కి చేరుకుంది. అంతటి క్రేజ్ రావడానికి ఈ సీరియల్ కథ కారణం. ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి చదువులో బంగారం, క్యారెక్టర్ లో ఉత్తమం..‌ అలాంటి వసుధార డీబీఎస్టీ కాలేజీలో చేరడం.. ఆ కాలేజీ ఎండీ రిషీని కలవడం.. వారి మధ్య ప్రేమ.. పెళ్ళి.. ఇలా ఎన్నో మలుపులతో వీరిద్దరు జోడీ చూడటానికి ఫ్యాన్స్ అలవాటు పడిపోయారు. ఇక తాజగా జరుగుతున్న ఎపిసోడ్‌ లలో రంగా పాత్రలో రిషి నటిస్తున్నాడా లేదా కనిపెట్టే ప్రాసెస్ లో వసుధార కొన్ని ప్రశ్నలు కురిపించింది. దాంతో రంగా , సరోజల మధ్య దూరం పెరగనుందా లేదా అనేది ఇందులోని పాయింట్.

రంగానే రిషి అని వసుధార స్ట్రాంగ్ గా నమ్ముతుంది. కానీ రంగా చుట్టూ ఉన్న సరోజ, రంగా వాళ్ళ నాన్నమ్మ, ఫ్రెండ్ ఇలా అందరు తను రంగానే అంటున్నారు. మరోవైపు ఎండీ పదవి కోసం శైలేంద్ర రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి రంగానే రిషి అని వసుధార నిరూపిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు యూట్యూబ్ లో ఈ ప్రోమో కింద అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రిషి, వసుధారల జోడీని మళ్ళీ చూడటం అదృష్టంగా ఉంది అని ఒకరు.. ' సృష్టి కలిపిన శుభలగ్నంలో పంచభూతాలే సాక్ష్యంగా చూపులు కలిసిన వేళ మొదటి ముడి పడింది. మాట మాట కలిసిన వేళ రెండవ ముడి పడింది. ఇరు మనసులు కలిసిన వేళ మూడవ ముడి పడింది ' ఇలా వారి బంధం శాశ్వతం అంటు మరొకరు కామెంట్ చేశారు. ఇలా ఈ సీరియల్ అభిమానులు ఎమోషనల్ కామెంట్లు చేస్తున్నారు. మరి మీలో ఎంతమంది ఈ సీరియల్ ని చూస్తారో కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.