English | Telugu

పండగలా భలే మంచి రోజు!

ఈటీవీ అంటే చాలు ఎన్నో స్పెషల్ షోస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఒక బెస్ట్ ఛానల్ అని చెప్పొచ్చు. ప్రతీ పండగని నిజమైన పండగలా చూపిస్తుంది. కలర్ ఫుల్ షోస్ తో బోర్ కొట్టించకుండా రకరకాలుగా ఎంటర్టైన్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు భలే మంచి రోజు టైటిల్ తో ఒక సూపర్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది. ఇప్పుడా ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈటీవీ మొదలై 27 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది ఈటీవీ.

ఈ ప్రోగ్రాం హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు ఉన్నాడు. ఇక అతని కామెడీ గురించి, హోస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో ఎంతోమంది ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు. ఆలీ, ఎస్పీ చరణ్, అన్నపూర్ణమ్మ, ఇంద్రజ, యాట నవీన, హరిత, జాకీ, బాలాజీ, కౌశిక్, యమున, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, అనసూయ, ఆది, రాంప్రసాద్, పోసాని కృష్ణమురళి, గీతామాధురి, రవికృష్ణ, నవ్యస్వామి, ఇలా బుల్లితెర మీద మనం రెగ్యులర్ గా చూసే ప్రతీ స్టార్ట్ ని ఈ ఒక్క ఎపిసోడ్ లో చూపించారు. ఇక ఈ ఎపిసోడ్ ఆగష్టు 28 రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.