English | Telugu

స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇదే సరైన పని!

అఖిల్ సార్థక్ బిగ్ బాస్ 4 రన్నరప్ గా నిలిచి జనాల్లో మంచి క్రేజ్ సంపాదించాడు. మోనాల్‌తో లవ్‌ ట్రాక్‌, సోహైల్‌తో ఫ్రెండ్‌షిప్‌ అఖిల్ కి బాగా కలిసొచ్చింది. బయటకి వచ్చాక కూడా ఆ క్రేజ్ ని నిలబెట్టుకున్నాడు. బిగ్ బాస్ క్రేజ్ తో కొన్ని మూవీస్, వెబ్ సిరీస్ లాంటి కొన్ని ఆఫర్స్ ని కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు బీబీ జోడిలో తేజుకి జోడిగా డాన్స్ ఇరగదీస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చాలామంది ఫాలోవర్లు ని సంపాదించుకుంటున్నాడు. రీసెంట్ గా బీబీ జోడి డాన్స్ షోలో గాయాలై ఆస్పత్రి పాలైనట్టు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ద్వారా తెలిసింది. ఇప్పుడు ఆ విషయంగా స్ట్రెస్ ఫీలవుతున్నట్టు కనిపిస్తోంది. ఆ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి పెయింటింగ్ వైపు మనసు లగ్నం చేసాడు. కృష్ణుడి చిత్రాన్ని అద్భుతంగా గీసి రంగులు వేసి స్ట్రెస్ నుంచి కొంచెం బయటపడినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.

"స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం పెయింటింగ్, పరిస్థితుల్లో చాలా మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. మనం బాలన్స్ గా ఉండాలి ఇదే ఇంపార్టెంట్ ...అప్పుడనిపించింది నాకు ఎంతో ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణుడిని పెయింటింగ్ చేయాలని. ఎందుకంటే ఆయనే నాకు అన్నీ..భోజనం కూడా చేయకుండా 7 గంటల సేపు ఈ పెయింటింగ్ వేస్తే చివరికి ఇంత అందంగా వచ్చింది..ఈ పెయింటింగ్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను..మీ ప్రేమను కామెంట్స్ రూపంలో చెప్పండి" అంటూ ఒక కాప్షన్ పెట్టాడు.

ఇక నెటిజన్స్ ఐతే కామెంట్స్ వరద కురిపిస్తున్నారు. "సూపర్బ్, అమేజింగ్, నీలో చాలా మంచి టాలెంట్ ఉంది..అసలే హెల్త్ బాలేదు కదా...టైంకి తిను.. కృష్ణుడి మీద నీకు ఎంత భక్తి ఉందో ఈ పెయింటింగ్ ద్వారా అర్ధమవుతోంది" అని రిప్లైస్ ఇచ్చారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.