English | Telugu

కృష్ణని ప్రేమిస్తున్నానని మురారి చెప్పడంతో ముకుంద షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-96 లో... ఇంటికి లేట్ గా వచ్చిన కృష్ణని ఎందుకు ఇంత లేట్ అయిందని భవాని అడిగినప్పుడు అక్కడే ఉన్న ముకుంద మధ్యలో కలుగజేసుకొని.. "ఊరు నుండి వచ్చావ్.. ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు" అని వెటకారంగా మాట్లాడుతుంది. నేను ఊరు నుండి వచ్చిన గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉన్నానని కృష్ణ అంటుంది. "నేను కూడా డబుల్ M.A చేశానని ముకుంద అంటుంది. "నేనేదో నువ్వు సిటీకి కొత్త ఏం తెలియదని, ఆ రకంగా అంటుంటే నువ్వు ఇలా అర్థం చేసుకున్నావ్" అని ముకుంద మాట మర్చి ప్రేమగా మాట్లాడినట్టు యాక్ట్ చేస్తుంది. కృష్ణతో పాటు అందరు కూడా సైలెంట్ గా ఉంటారు. ఇంట్లో ఆదర్శ్ లేడు కాబట్టి నన్ను పీచుక పుల్లతో సమానంగా చూస్తున్నారని ముకుంద అంటుంది. కృష్ణని వెటకారంగా ఇండైరెక్ట్ గా ముకుంద మాటలు అంటుంది. దాంతో
"ఇంట్లో నన్ను అందరు ఊరు నుండి వచ్చింది అనేవాళ్ళే" అని కృష్ణ ఏడుచుకుంటూ తన గదిలోకి వెళ్తుంది. అలా కృష్ణ వెళ్ళేప్పుడు.. మురారి తనని చూసి ఏమైందని అడిగినా చెప్పకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత మురారి హాల్ లోకి వచ్చి.. "కృష్ణ ఎందుకు ఏడుస్తుంది" అని రేవతిని అడుగుతాడు. అప్పుడు రేవతి ఆ గొడవ అంతా ఎందుకు చెప్పాలని.. టీ తాగుతావా మురారి అని అడుగుతుంది. అక్కడే ఉన్న భవాని.. నీ భార్య కాలేజీకి వెళ్ళి రావడానికి ఏదైనా ఏర్పాటు చేయ్ మురారి. ఈ ఇంటి కోడలు కాలేజీ నుండి లేట్ గా వస్తూ ఇబ్బంది పడడం బాగోదని భవాని చెప్పగా.. సరే పెద్దమ్మ అని మురారి చెప్తాడు.

ఆ తర్వాత గదిలో ఉన్న కృష్ణ దగ్గరికి మురారి వెళ్ళి.. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ కృష్ణా అని అడగుతాడు. ముకుంద చేసిన గొడవ అంతా చెప్తూ.. మీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిందంటూ మురారితో అంటుంది. ఇక మురారి కోపంగా ముకుందని రమ్మని చెప్తాడు. "నువ్వు కృష్ణని ఏం అన్నావ్.. కృష్ణని తక్కువ చేసి మాట్లాడుతున్నావంట కదా.. కృష్ణతో పోల్చితే నీ స్టేటస్ తక్కువే.. కృష్ణకి ఊళ్ళో సొంత ఇల్లు, పొలం ఉంది.. ఇంకా తను కాబోయే డాక్టర్" అని మురారి అంటాడు. ఏంటి నువ్వు కృష్ణకి అంత సపోర్ట్ చేస్తున్నావ్? కృష్ణని ప్రేమిస్తున్నావా? అని ముకుంద అడుగుతుంది. "అవును ప్రేమిస్తున్నాను. ప్రేమించడం తప్పేమి కాదే.. ప్రేమేం ఉన్మాది కాదే.. ఎంత ప్రేమ పంచిన తప్పు లేదు" అని కృష్ణ మీద ప్రేమతో.. తనకి సపోర్ట్ గా మురారి మాట్లాడుతాడు. అలా మురారి అనడం భరించలేని ముకుంద కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.