English | Telugu

తేజస్విని వల్లే అఖిల్ చాలా కంఫర్ట్ గా ఉన్నాడంట!

బిబి జోడి ప్రతీ శని, ఆదివారాల్లో స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. కాగా ఈ షోకి సదా, తరుణ్ మాస్టర్, రాధ జడ్జ్ లుగా వ్యవహరిస్తుండగా శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ప్రేక్షకుల కోసం.. ఇప్పటివరకు జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్లలోని కంటెస్టెంట్స్ తో ఈ డ్యాన్స్ షోని ఏర్పాటు చేసారు.

అయితే ఇందులో శనివారం పటాకా జోడీలు, ఆదివారం ధమాకా జోడీలు తమ పర్ఫామెన్స్ ఇస్తారు. మొదట ఫైమా-సూర్య కలిసి నాన్న- కూతురి మధ్య ఎమోషన్ బాండింగ్ తీసుకొని పర్ఫామ్ చేసారు. అది చూసాక షోలో అందరూ ఎమోషనల్ అయ్యారు. జడ్జ్ తరుణ్ మాస్టర్ కి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడని చెప్పాడు. "మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇలా ఉండటానికి మా నాన్నే కారణం. మా నాన్న నాకు రెండు విషయాలు చెప్పాడు. ఎస్ ఆర్ నో.. ఎస్ చెప్పే అవసరం వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. నో చెప్పాల్సి వస్తే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే చెప్పేయాలి" అని రాధ చెప్తూ ఎమోషనల్ అయింది.

ఆ తర్వాత అఖిల్-తేజస్విని జోడి డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి రాధ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. రతీదేవి-కామదేవుడు కలిసి డ్యాన్స్ చేసినట్టుగా ఉందని, వాళ్ళిద్దరి కనెక్షన్ బాగా కుదిరిందని రాధ చెప్పుకొచ్చింది. "కంపోజిషన్ నుంచి మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ రెండు బాడీలు ఒక సోల్ లాగా బాగుంది. ఆ కలర్స్, మూమెంట్స్ అన్నీ బాగా కుదిరాయి. మీ ఇద్దరి పర్ఫామెన్స్ చూసి నాకు నోట మాట రావట్లేదు. డెఫినెట్లీ యూ పీపుల్ ఆర్ బ్యాక్. స్పీచ్ లెస్" అని సధా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తరుణ్ మాస్టర్ మాట్లాడుతూ.. "ఇద్దరి కెమిస్ట్రీ, అన్నీ బాగా కుదిరాయి. బాగుంది" అని చెప్పాడు. అయితే చివరలో‌.. తేజస్విని నీ గురించి ఒకటి చెప్పాలని రాధ తన మనసులోని మాటని బయట పెట్టేసింది. "రొమాన్స్ చేసేటప్పుడు ఇద్దరిలో అమ్మాయి ఒక స్టెప్ ముందు ఉంటూ కంఫర్ట్ ఇస్తుంది.‌ అది ఎవ్వరూ చేయలేరు.. అంత ఈజీ కాదు. తేజస్విని వల్లనే అఖిల్ చాలా కంఫర్ట్ గా ఉన్నాడు" అని రాధ చెప్పుకొచ్చింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.