English | Telugu

'ఒక్క ఛాన్స్ ప్లీజ్' అంటున్న 'కస్తూరి' నటి!


అనితాచౌదరి 'కస్తూరి'టీవీ సీరియల్ తో ఫుల్ ఫేమస్ ఐన నటి.. ఈమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో నటించే అవకాశం వచ్చినప్పుడు టీవీ సీరియల్ కోసం ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది.. అలా ఒకసారి కాదు రెండు సార్లు. కానీ ఇప్పుడు "ఒక్క ఛాన్స్ ప్లీజ్" అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. 'కస్తూరి'సీరియల్ తో పాపులరైన ఈమె కొంత కాలం మూవీస్ లో నటించి సడెన్ గా మాయమైపోయింది. మళ్ళీ తర్వాత ప్రత్యక్షమయింది.

ఇప్పుడు అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. పవర్ స్టార్ తో చేజార్చుకున్న మూవీ ఛాన్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో విషయాలు మాట్లాడారు. "కస్తూరి టీవీ సీరియల్ లో నటిస్తూ ఉన్నప్పుడు 'తొలిప్రేమ' మూవీ కోసం ఆ మూవీ టీమ్ నన్ను అడిగింది. కాకపోతే అప్పుడు నేను టైటిల్ రోల్ చేస్తున్నాను అందుకే డేట్స్‌ని ఇవ్వలేమని చెప్పేశారు. అప్పటికి తెలీదు కదా.. మాకెవరికీ తెలియలేదు ఓ మంచి సినిమాని మిస్ అవుతున్న విషయం.. ఆ ఒక్క సినిమానే కాదు.. చాలా సినిమాల్ని వదిలేసుకోవాల్సి వచ్చింది.ఆ తర్వాత సీరియల్స్‌కి దూరమై.. సినిమాల్లో చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఛాన్సెస్ ని వదులుకోవాల్సి వచ్చింది’’ అని చెప్పింది అనితా చౌదరి.

అలాగే పవన్ కళ్యాణ్ మూవీ 'తీన్‌మార్'లో కూడా అవకాశం వచ్చేసరికి ఆలోచించకుండా సైన్ కూడా చేసేసి అనుకోని పరిస్థితుల వలన సినిమాకు దూరం కావాల్సి వచ్చిందని చెప్పింది. "ఆ మూవీ షూటింగ్ యూఎస్ లో అన్నారు. దాంతో నేను టీమ్ యూనిట్ కంటే ముందే అక్కడికి వెళ్లిపోయాను. కానీ.. టీమ్‌ మెంబర్స్‌కి వీసా ప్రాబ్లమ్ వచ్చి ఆ మూవీని మరో దేశంలో షూట్ చేశారు. అప్పుడు నేను చేయాల్సిన క్యారెక్టర్‌ని భార్గవితో చేయించారు. ఇలా పవన్ కళ్యాణ్‌తో చేసే అవకాశం రెండు సార్లు చేజారిపోయింది. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. నాకు ఇలా రిక్వెస్ట్ చేసే రోజు వస్తుందని అనుకోలేదు’’ అంది అనితా చౌదరి.

'ఛత్రపతి' మూవీలో కళ్ళు లేని తల్లి పాత్రలో కొడుకుని "సూరీడు"అని పిలుస్తూ నటించి మెప్పించింది అనితాచౌదరి. ఆ తర్వాత మురారి, నువ్వే నువ్వే, ఉయ్యాల జంపాల వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోనూ నటించింది. కానీ ఈ మధ్య ఆమెకు అవకాశాలు చాలా తగ్గిపోయాయి అనే చెప్పాలి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.