English | Telugu

'పాన్ ఇండియా' మూవీలో సుధీర్..టైటిల్ మార్చమంటూ సలహా ఇచ్చిన డైరెక్టర్

బుల్లితెర మీద ఎన్నో కామెడీ షోస్ ప్రసారం అవుతున్నాయి. వాటికి కొంచెం భిన్నంగా ఆహా ఓటిటిలో "కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ " పేరుతో ఒక కామెడీ షో డిసెంబర్ లో మొదలయ్యింది. ఇప్పటికి 5 ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి..ఇక ఇప్పుడు ఎపిసోడ్ 6 కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో కమెడియన్స్ రకరకాల గెటప్స్ లో వచ్చి నవ్వించారు. హోస్ట్స్ దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్ స్టైలిష్ డ్రెస్సెస్ లో వచ్చి అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.

ఇక ప్రోమో ఎంట్రీ చూస్తే "సుధీర్ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు సర్" అంటూ ఈ షో చైర్మన్ అనిల్ రావిపూడికి చెప్పింది దీపికా. ఆ మాటలకు సుధీర్ తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు. "ఐతే అన్ని భాషల్లో రిలీజ్ అవుద్దా" అని చైర్మన్ అడిగేసరికి "లేదు సర్ తెలుగులోనే రిలీజ్ అవుతుంది" అని ఇన్నోసెంట్ ఫేస్ తో చెప్పాడు సుధీర్. "తెలుగులో విడుదల అయితే పాన్ ఇండియా ఎలా అవుద్దిరా " అని చైర్మన్ అడిగేసరికి "సినిమా పేరే పాన్ ఇండియా. అది షార్ట్ ఫిల్మ్.. యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంది" అని సుధీర్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు." వీలైతే టైటిల్ మార్చొచ్చా" ప్లీజ్ అన్నట్టుగా సుధీర్ చేతులు పట్టుకుని మరీ బతిమాలాడాడు అనిల్ రావిపూడి. "ఏం మార్చొచ్చు సార్" అని సుధీర్ ఆనాడు. "పాన్ ప్లేస్ లో బ్యాన్ పెట్టు" అంటే బాగుందని అంటాడు సుధీర్. తర్వాత మరి "ఇండియా ప్లేస్ లో ఏం పెట్టాలి" అనేసరికి "నీ పేరు పెట్టు" అని వెళ్ళిపోయాడు డైరెక్టర్. దీంతో ఆ "పాన్ ఇండియా" అనే సినిమా పేరు కాస్తా "బ్యాన్ సుధీర్" గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.