English | Telugu

కిర్రాక్ ఆర్పీ 'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' షాప్ క్లోజ్!

జబర్దస్త్ షోతో పాపులర్ ఐన కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. ఐతే ఈ కమెడియన్ షోకి దూరమైపోయినా టీం పేరు మాత్రం తన ఇంటి పేరుగా మారిపోయింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో 'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' పేరుతో ఒక కర్రీ పాయింట్ ని ఓపెన్ చేసాడు. కిర్రాక్ ఆర్పీ ఫాలోయింగ్ వలన షాప్ కి మంచి క్రేజ్ కూడా వచ్చింది.

ఈ షాప్‌కి కస్టమర్స్ రద్దీ బాగా పెరిగి ట్రాఫిక్ జామ్ ఐపోయేది. దీంతో ఇక్కడ కర్రీస్ చేయడానికి సరిపడా సిబ్బంది లేక ఆర్పీ ఇబ్బంది పడుతున్నాడు. జనం ఎక్కువై, వంటకాలు తక్కువయ్యేసరికి సరైన సమయంలో పార్సిల్స్ చేయలేకపోతున్నారు. ఇదంతా చాలా కష్టమైపోవడంతో కిర్రాక్‌ ఆర్పీ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. కొత్త ఏడాది సందర్భంగా కర్రీ పాయింట్‌ని క్లోజ్‌ చేసి కస్టమర్లకి షాకిచ్చాడు.

ఇక ఈ విషయం మీద ఆర్పీ మాట్లాడుతూ,"మా కర్రీ పాయింట్‌కి జనం తాకిడి ఎక్కువయ్యింది. చాలా దూరం నుంచి జనం వస్తున్నారు. వాళ్లకు సరైన టైములో కూరలు అందించలేకపోతున్నాం. అందుకే షాప్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. కిచెన్ కెపాసిటీని పెంచి కొన్ని మార్పులు చేసాకతిరిగి కర్రీ పాయింట్‌ని ఓపెన్‌ చేస్తాం" అని చెప్పాడు.. ఐతే ఈ విషయం తెలియని వాళ్ళు షాపుకు వస్తున్నారని వారికి క్షమాపణలు చెబుతూ, దయజేసి ఈ విషయాన్ని గమనించాలని కోరాడు. అంతేకాదు.. నెల్లూరు చేపల పులుసు బాగా వండే మహిళలను తీసుకొచ్చి వారితో వండిస్తే బాగుంటుందన్న ఆలోచనతో త్వరలో నెల్లూరులో ఆడిషన్స్ పెట్టి మంచి లేడీ చెఫ్స్‌ని సిటీకి తీసుకొస్తాం" అని చెప్పాడు ఆర్పీ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.