English | Telugu
తాతయ్యతో సుమ ఫోటో..యాంకర్ కి టిప్స్ ఇచ్చిన నెటిజన్!
Updated : Jan 24, 2023
సుమ కనకాల గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బుల్లితెర మీద ఎక్కడ చూసినా సుమ కనిపిస్తూ, అలరిస్తూ, అల్లరి చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాని కూడా బాగా యూజ్ చేసుకుని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు ఈమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్న ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాత మనవరాలు కలిసి దిగిన ఫోటో అది. " మా అమ్మా వాళ్ళ మావయ్య..నాకు తాతయ్య అవుతారు. ఆయన పేరు పి.బి. మీనన్. ఆయన వయసు 97 ఏళ్ళు. ఇంత వయసులో కూడా ఆయన పాలక్కాడ్ కోర్ట్ లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు అర్దమయ్యిందా నాలో జీన్స్ ఎవరివో అని" ఆ ఫోటోకి కాప్షన్ పెట్టుకుంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోకి మరో యాంకర్ గాయత్రీ భార్గవి "మంచి ఫొటో..ఆయనకు నా వందనం" అని రిప్లై ఇచ్చారు. ఒక నెటిజన్ మాత్రం గాయత్రీ భార్గవి రిప్లైకి స్పందిస్తూ " మీరు ఇంకా యాంకరింగ్ లో పికప్ అవ్వాలి..సుమ గారి కన్నా పెద్ద యాంకర్ కావాలి. సుమ గారు మాత్రమే ఇంత పెద్ద యాంకర్ అయ్యారు మిగతా వాళ్ళు ఎందుకు కాలేకపోయారు అంటే దానికి ఒక చిన్న టిప్ తెలుసుకోవాలి. తెలుసుకోవాలనే తపన సుమ గారిలో చాలా ఎక్కువ.
అదే ఆమెను అందలం ఎక్కించింది. మిగతా యాంకర్స్ కంటే కూడా చాలా భిన్నంగా నిలబెట్టింది. యాంకరింగ్ అంటే జాబ్ లా చేయొద్దు..ఇష్టంతో చేయాలి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నట్టే మాట్లాడాలి. అందరితో అక్క, వదిన, పిన్ని అంటూ రిలేషన్ మెయింటైన్ చేయాలి. తెలుగు ఆడియన్స్ కి "నేను మీ అమ్మాయిని" అని చెప్పాలి . అలా చెప్పేటప్పుడు కళ్ళల్లో మెరుపులు రావాలి. వాళ్ళు మనల్ని సొంతం అన్నట్టుగా ఉండాలి" అంటూ ఆ నెటిజన్ ఎన్నో టిప్స్ చెప్పారు .