English | Telugu

తన అమెరికా ట్రిప్ ని ఒక్క నిమిషంలో చూపించిన యాంకర్ రవి!

బుల్లితెర టీవీ యాంకర్స్ లో యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని పంచ్ లకి, మాటలకీ ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే ఉంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో అతను చేసే పోస్ట్ లు వైరల్ అవుతుంటాయి.

యాంకర్ రవి ఎక్కడికి వెళ్ళిన తన ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తుంటాడు. అందులో మొన్న శ్రీలంకకి సముద్రం మీదుగా వెళ్ళాడు. దాని గురించి వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయింది. అయితే తాజాగా తన అమెరికాకి ఒక షూట్ నిమిత్తం వెళ్ళాడు. అయితే వెళ్ళేముందు తను ఎయిర్ పోర్ట్ లో ఒక లుంగీ లా ఉండే డ్రెస్ ని ధరించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. దానికి నెగెటివ్ కామెంట్స్ రావడంతో వాటికి ఘాటుగా రిప్లై ఇచ్చాడు రవి.

అమెరికాకి వెళ్ళి వస్తున్నట్టుగా ఒక వీడియోని చేశాడు రవి. ఏదో మిస్ అయినట్లు తన చేతిని అలా ఇంటివరకు తీసుకొచ్చి తన భార్యని పట్టుకొని హగ్ చేసుకున్నాడు‌. ఇదంతా వీడియోలా చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు రవి. కాగా ఈ పోస్ట్ కి వదినని మిస్ అవుతున్నట్టుగా కవర్ చేయడానికే కదా అన్న ఈ వీడియో అని ఒకరు కామెంట్ చేయగా అది వైరల్ అయింది. అయితే ఇప్పుడు పదిహేను రోజుల పాటు అమెరికాకి వెళ్ళి వచ్చిన ఫోటోలన్నీ కలిపి.. " My 15 Days U.S trip in 1.30mints " అనే టైటిల్ తో పోస్ట్ చేశాడు. కాగా ఈ ట్రిప్ లో తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ థాంక్స్ చెప్పాడు. అక్కడ అమెరికాలో దిగిన ఫోటోలన్నీ కలిపి షార్ట్ వీడియోగా చేశాడు రవి. దీంతో ఇప్పుడు రవి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.