English | Telugu

ఆసియా కోసం కార్ కొన్న జబర్దస్త్ నూకరాజు!


బుల్లితెర ఆడియన్స్ కి కమెడియన్ నూకరాజు గురించి పరిచయం చేయక్కర్లేదు. "పటాస్" షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన నూకరాజు తర్వాత జబర్దస్త్ లో అవకాశం అందుకున్నాడు. అప్పటినుండి చలాకి చంటి టీమ్ లో సభ్యుడిగా ఉంటూ స్కిట్స్ చేస్తూ వస్తున్నాడు. అలా జబర్దస్త్ , ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎంటర్టైన్ మెంట్ షోస్ అన్నిట్లో కూడా తనదైన పెర్ఫార్మన్స్ లతో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు.

ఇప్పుడు జబర్దస్త్ లో టీమ్ లీడర్ అయ్యాడు. ఇంతకాలం చలాకి చంటి టీమ్ లో ఉన్న నూకరాజు.. ఇప్పుడు ‘నాన్ స్టాప్ నూకరాజు’ అనే టీమ్ పేరుతో స్కిట్స్ చేస్తున్నాడు. ఇక నూకరాజు-ఆసియా ప్రేమాయణం సంగతి తెలిసిందే. మరి అలాంటి తన స్నేహితురాలి కోసం నూకరాజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. కియా కంపెనీకి చెందిన ఒక కారును కారును ఆసియా కోసం కొన్నాడు నూకరాజు. దానికి సంబంధించిన వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది ఆసియా.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.