English | Telugu
తనని భార్యగా ఒప్పుకోనని చెప్పిన రిషి.. షాకైన మహేంద్ర!
Updated : Mar 3, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-701 లో.. రిషి తన పట్టుదలతో వసుధారని బాధపెడుతూనే ఉంటాడు. "నీకు నువ్వుగా వేసుకున్న తాళికి నన్ను బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదు. అందరి ముందు నువ్వు తలదించుకోవద్దని అలా చెప్పానంతే" అని రిషి అంటాడు. దాంతో వసుధార ఎమోషనల్ గా బయటకెళ్తుంది. జగతి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. వసుధార ఎందుకు ఏడుస్తుందో జగతికి అర్థం కాదు. మేడం నన్ను ఇంటి దగ్గర దింపండని వసుధార అనగానే.. జగతి సరేనని ఒప్పుకొని కార్ లో తీసుకెళ్తుంది.
మరోవైపు రిషి దగ్గరికి మహేంద్ర వచ్చి చాలా సంతోషంగా.. "రిషి మనం పార్టీ చేసుకుందాం" అని అంటాడు. ఎందుకు డాడ్ అని రిషి అడుగుతాడు. నువ్వు వసుధార కలిసిపోయారుగా అందుకే అని మహేంద్ర అనగానే.. "నేను అందరి ముందు ఒప్పుకున్నది అందుకు కాదు. వసుధార అందరిముందు తల దించుకోకూడదనే చెప్పాను. వసుధార మెడలో తాళికి మాత్రమే నేను కారణం. నన్ను భర్తగా అనుకొని తన మెడలో తాళి వేసుకుంది. కాని తనని భార్యగా నేను ఒప్పుకోవట్లేదు" అని మహేంద్రతో రిషి అంటాడు. "ఏంటి రిషి అలా మాట్లాడుతున్నావ్? ఇంకా వసుధారని ఎప్పుడు క్షమిస్తావ్? వసుధారతో ఇదంతా అన్నావా" అని మహేంద్ర అడిగేసరికి.. చాలా క్లారిటీగా చెప్పాను డాడ్ అని రిషి చెప్పి.. అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత జగతి కార్ వెనకాలే రిషి వెళ్తాడు. జగతి కార్ ని రిషి తన కార్ తో దాటేసి వాళ్ళని కార్ ఆపమని చెప్తాడు. వాళ్ళు కార్ ఆపిన తర్వాత అందులో ఉన్న వసుధార దగ్గరికి వెళ్ళి.. "నాకు చెప్పకుండా కాలేజీ నుండి ఎందుకు వచ్చావ్ వసుధార" అని రిషి అడుగుతాడు. సర్ నాకు తలనొప్పిగా ఉందని వసుధార అనడంతో.. నాకు చెప్పాలి కదా అని రిషి అంటాడు. అప్పుడే ఫోన్ తీసుకొని లీవ్ అని రిషికి మెసేజ్ చేస్తుంది. నేను మాట్లాడాలని రిషి అంటాడు. నాకేం మాట్లాడాలని లేదు బై అని వసుధార చెప్పడంతో రిషి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక వసుధార, జగతిలు కూడా వెళ్ళిపోతారు. రిషి ఇంటికెళ్ళగానే.. తనని చూసిన దేవయాని రిషితో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఏంటి పెద్దమ్మ అలా వెళ్తుందని దేవయాని దగ్గరికి వెళ్తాడు రిషి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.