English | Telugu

పుట్టపర్తి సాయిబాబా తనని చూసాడని చెప్పిన ఇంద్రజ!

ఇంద్రజ.. ఈ పేరు వినగానే ప్రతీ ఒక్కరికి గుర్తొచ్చే సినిమా 'యమలీల'.యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా వచ్చిన 'యమలీల' సినిమా లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ.. అప్పట్లో చిన్నా పెద్దా తేడాలేకుండా అందరి హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గాపేరుతెచ్చుకున్నారు. హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్న సమయంలోనే పెళ్ళి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు తన కెరియర్ ని కొత్తగా మలుచుకుంటున్నారు. జబర్దస్త్ లో జడ్‌గాతన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంద్రజ.. ఇప్పుడు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' లో కూడా జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే..

ఇంద్రజ అందరితో హంబుల్ గా ఉంటూ ఎవరినీ నొప్పించక, కష్టాలలో ఉన్నామనిఎవరైనా చెప్పిన వెంటనే కరిగిపోతుంది. వారికి తన వంతు సాయం కూడా చేస్తుంది. అయితే సంప్రదాయ చీరకట్టుతో ఎప్పుడూ కనిపించేఇంద్రజ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

"నేను పుట్టపర్తి సాయిబాబాను ఆరాధిస్తాను.ఒకరోజు నేను యూట్యూబ్ షార్ట్ వీడియోలుచూస్తున్నప్పుడు నా ఫోటోలు ఉన్న షార్ట్ వీడియోపక్కన పుట్టపర్తి సాయిబాబా ఉన్నారు. అయితేబాబా గారు ఒక ఫోటోలో మాములుగా ఉండగా.. మరొక ఫోటోలో నన్ను చూస్తున్నట్టుగా ఉన్నారు. అది చూసి ఒక్కసారిగానేను షాక్ అయ్యాను. నేను నమ్మే బాబా.. నన్ను చూడటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది" అంటూ ఇంద్రజ తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియోని పోస్ట్ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.