English | Telugu
'గంగూబాయ్' లుక్‌లో నిహారిక.. కాంప్లిమెంట్ ఇచ్చిన అల్లు స్నేహ!
Updated : Sep 20, 2022
సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంత ట్రెండింగో అందరికీ తెలుసు. అలాంటి ఒక రీల్ చేసి నిహారిక కొణిదెల ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తోంది. లేటెస్ట్‌గా ఆమె గంగూబాయ్‌గా మారిపోయింది. తెల్ల చీర, ఎర్రటి లిప్ స్టిక్, నోట్లో పాన్, చేతిలో బ్యాగ్ ధరించి చూడడానికి అచ్చంగా ఆలియా భట్ చేసిన క్యారెక్టర్.. గంగూబాయ్ లుక్‌లోకి చేంజ్ ఐపోయింది.
ఒక పార్టీలో ఈ గెటప్ తో వచ్చి ఆ వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాలీవుడ్ మూవీ 'గంగూబాయ్ కథియవాడి' ఎంత సూపర్ డూపర్ హిట్ సినిమానో అందరికీ తెలుసు. ఇందులో గంగూబాయ్ గా ఆలియాభట్ నటన వేరే లెవెల్. "గంగూని ఇమిటేట్ చేస్తున్నాను. నాకు ఇలాంటి కాస్ట్యూమ్స్ పార్టీస్ అంటే ఇష్టమని మీకు తెలుసు కదా.. దయచేసి నా వెనుక ఉన్న కోతులను పట్టించుకోకండి" అని రాసి ఫొటోస్, వీడియో పోస్ట్ చేసింది నిహారిక. ఈ వీడియోపై అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్పందించింది."సూపర్" అంటూ కామెంట్ చేసింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నిహారిక తన భర్తతో కలిసి ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫోటోలు, వీడియోలు, మూవీ అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ లైమ్ లైట్ లో ఉంటోంది. ప్రస్తుతం నిహారిక ఫోటోలు, ఆమె వీడియో క్లిప్‌సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.